టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ( Cricketer Virat Kohli,Anushka Sharma ) ప్రేమించే పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.ముందుగా ఒక షూటింగ్ లో కలిసి నటించిన వీళ్లిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మొదలై ఆ తర్వాత ప్రేమగా మారి ఆ ప్రేమ పెళ్లి బంధంతో ముడి పడింది.
పెళ్లి తర్వాత వీళ్ళకి మొదట ఒక పాప పుట్టింది.ఆమెకి వామిక అని పేరు పెట్టుకున్నారు ఈ జంట.అయితే ఫిబ్రవరి 15న రెండవసారి పండంటి మగ బిడ్డకు( Baby Boy ) జన్మనిచ్చారు ఈ జంట.ఈ విషయాన్ని అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేశారు.ఈ విషయం చెప్పటానికి సంతోషిస్తున్నామని ఈ అందమైన సమయంలో అందరి ఆశీర్వాదాలు కావాలంటూ కోహ్లీ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు.తమ ఏకాంతాన్ని గౌరవించమని విజ్ఞప్తి చేస్తున్నామన్నాడు.దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు, మరో కింగ్ కోహ్లీ వచ్చాడు అంటూ విషెస్ అందిస్తున్నారు.మనదేశంలో ప్రజలతోపాటు దాయాది దేశమైన పాకిస్థాన్( Pakistan ) ఉన్న విరాట్ కోహ్లీ అభిమానులు సైతం కొందరు స్వీట్స్ పంచుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది.అయితే విరాట్ జంట సోషల్ మీడియా వేదికగా బిడ్డ పేరుని కూడా అనౌన్స్ చేశారు.ఆ దేవుడి ఆశీస్సులతో బేబీ బాయ్ పుట్టాడు.అనుష్క శర్మ, బేబీ హ్యాపీగా ఉన్నారు హెల్దిగా ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు.అంతేకాదు బేబీ పేరు అకాయ్( Akaay ) అంటూ రివీల్ చేశారు.దాంతో విరాట్ అభిమానులు అకాయ్ అంటే అర్థం ఏమిటో సెర్చింగ్ చేయడం మొదలుపెట్టారు.
ఇంతకీ అకాయ్ అంటే అర్థం ఏమిటంటే దృఢమైన శరీరం కలవాడు అని అర్థం.అలాగే హిందీలో కాయ్ అంటే కాయం లేదా శరీరము( Body ) అని అర్థం.పరమశివుడు శరీరం లేని వాడు కాబట్టి అకాయ్ అంటే పరమశివుడు అని అర్థం కూడా ఉంది.టర్కీస్ లో అకాయ్ అంటే ఉదయించే సూర్యుడు అని అర్థం అంతేకాదు అనుష్క శర్మ( Anushka Sharma ) లో అ విరాట్ కోహ్లీలో క నీ మిక్స్ చేస్తూ అకాయ్ అని పెట్టారంట.
ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది
.