వైరల్ వీడియో: యూనిఫామ్స్‌లో పోలీస్ అధికారులు ప్రీ-వెడ్డింగ్ షూట్.. స్పందించిన కమిషనర్...

ఈ రోజుల్లో చాలామంది వధూవరులు తమ వెడ్డింగ్ సెలబ్రేషన్స్( Wedding Celebrations ) చిరకాలం గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తున్నారు.ఫోటో షూట్ నుంచి ఫ్రీ వెడ్డింగ్ వీడియో సాంగ్స్( Free Wedding Video Songs ) షూట్ల వరకు అన్నిటినీ ట్రై చేస్తున్నారు.

 Viral Video Pre-wedding Shoot Of Police Officers In Uniform Commissioner Respond-TeluguStop.com

అయితే ఈ ట్రెండ్ కేవలం సామాన్యులకు మాత్రమే కాదు పోలీస్ ఆఫీసర్లకు కూడా పాకింది.తాజాగా ఇద్దరు పోలీసులు ప్రీ వెడ్డింగ్ షూట్ అదిరిపోయే రీతిలో జరుపుకున్నారు.

హైదరాబాద్ నగరంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న భావన, ఏఆర్‌ ఎస్సైగా పని చేస్తున్న రావూరి కిషన్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు ఇటీవల పెద్దలు కూడా వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దాంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

పెళ్లి ముహూర్తానికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అద్భుతంగా వారు ప్లాన్ చేశారు.అయితే వారు తమ ప్రొఫెషన్స్ ని పరిచయం చేయడానికి ప్రీ వెడ్డింగ్ షూట్లో భాగంగా పోలీసు వాహనాలను, స్టేషన్ వాడుకున్నారు.వీడియో గ్రాఫర్ ని తీసుకొచ్చి సినిమాటిక్ స్టైల్‌లో వారు వీడియో షూట్ చేయించారు.

ఆ సమయంలో ఖాకి యూనిఫాంలోనే ఉన్నారు.అయితే దీన్ని కొందరు తప్పు పడుతున్నారు.

వ్యక్తిగత అవసరాలకు గవర్నమెంట్ మౌలిక సదుపాయాలను వాడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పెళ్లి ఆగస్టు నెలలోనే జరిగిపోయింది కాకపోతే వీరి ప్రీ వెడ్డింగ్ షూట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఇద్దరు పోలీసు అధికారుల ప్రీ-వెడ్డింగ్ షూట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.ఈ జంట తమ పోలీసు యూనిఫామ్‌లను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించారని కొందరు విమర్శించగా, మరికొందరు వారికి మద్దతు తెలిపారు.ఈ వివాదంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ట్విట్టర్‌లో స్పందించారు.ప్రీ వెడ్డింగ్ షూట్‌ల కోసం పోలీసు అధికారులు యూనిఫాం ధరించడం పట్ల తనకు అభ్యంతరం లేదని, అయితే వారు ముందుగా డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతి తీసుకోవాలని ఆయన అన్నారు.

పెళ్లికి తనను పిలవనప్పటికీ, ఆ జంటను ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.అనుమతి తీసుకోకుండా ఈ తప్పు రిపీట్ చేయవద్దని కమిషనర్ ఆనంద్ ఇతర పోలీసు అధికారులను కూడా హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube