Dog saved cat: కుక్క తెలివికి నెటిజన్లు ఫిదా.. ప్రాణాపాయంలో ఉన్న పిల్లిని కాపాడిందిలా

కొన్ని జంతువులకు జాతి వైరం ఉంటుంది.ముఖ్యంగా పిల్లి-ఎలుక, కుక్క-పిల్లి వంటి వాటి మధ్య ఈ వైరం ఎక్కువగా కనిపిస్తుంది.

 Viral Video Dog Saved Cat Which Is In Danger Details, Dog, Cat,helping, Viral L-TeluguStop.com

వీటికి సంబంధించిన వీడియోలు మనలను బాగా అలరిస్తున్నాయి.చిన్నారులు కూడా కార్టూన్లలో వీటిని చూసేందుకు ఇష్టపడతారు.

అయితే జాతి వైరం మరిచి జంతువులు కలిసి ఉంటే చాలా చూడముచ్చటగా ఉంటుంది.వాటి మధ్య ఉండే స్నేహం గురించి తెలిపే వీడియోలు ఇంటర్‌నెట్‌లో కనిపిస్తుంటాయి.

వాటికి విపరీతమైన వ్యూస్ ఉంటాయి.తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రాణాపాయంలో ఉన్న ఓ పిల్లిని కుక్క చాలా తెలివిగా కాపాడింది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ వీడియోల విషయానికి వస్తే కుక్క-పిల్లి వీడియోలు విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి.ఇలాంటి మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తాయి.ఇప్పుడు అలాంటిదే ఓ వీడియో నెటిజన్లకు ఆశ్చర్యం కలిగిస్తోంది.పిల్లిని ఓ కుక్క పిల్ల నీటిలో మునిగిపోకుండా కాపాడే వీడియో ఒకటి నెట్‌లో విస్తృతంగా హల్‌చల్ చేస్తోంది.

దీనిని బ్యూటెంగెబిడెన్ అనే ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.అందులో నీటి ప్రవాహంలో ఓ పిల్లి కొట్టుకు పోయే ప్రమాదంలో ఉంది.

అయితే ఓ రాయిపై నిలబడి అది తన ప్రాణం కాపాడుకుంది.

అయితే ఎవరైనా తనకు సాయం చేస్తారేమో అని ఎదురు చూసింది.అయితే దాని బాధను ఓ కుక్క గమనించింది.వెంటనే నీటి ప్రవాహం వద్దకు వెళ్లింది.

చెక్క ముక్కను నోట కరుచుకుని దానిని తీసుకెళ్లి ఆ నీటి ప్రవాహంలో వేస్తుంది.దీంతో ఆ పిల్లి వెంటనే ఆ చెక్కపై ఎక్కుతుంది.

ఇక ఆ కుక్క ఆ చెక్క ముక్కను మెల్లగా ఒడ్డుకు చేర్చుతుంది.ఇలా దానిని చనిపోకుండా కుక్క కాపాడింది.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేయబడిన 24 గంటలకే దాదాపు 2 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube