మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా శాస్త్రవేత్తలు పరిశోధనలను ముమ్మరం చేస్తున్నారు.అనేక రకాల పరిశోధనల వల్ల నూతన టెక్నాలజీ వైపు అడుగులు పడుతున్నాయి.
మనిషి శ్రమకు బదులుకు వస్తువుల వినియోగం ఎక్కువవుతోంది.రోబోలు వాడకం రానురాను విపరీతంగా పెరుగుతోంది.
ఇటువంటి నేపథ్యంలో శాస్త్రవేత్తలు మానవ మనుగడకు సంబంధించిన విషయాన్ని కనుగొన్నారు.ఆధారాలతో సహా శాస్త్రవేత్తలు మనముందు ఉంచారు.
ఉత్తర అమెరికాలోని న్యూ మెక్సికోలో 23వేల ఏళ్ల క్రితమే మానవులు బతికి ఉన్నట్లుగా తేలింది.మనుషులు ఆ కాలంలో జీవించి ఉన్నారనే ఆధారాలను కూడా శాస్త్రవేత్తలు పొందుపరిచారు.
మానవ మనుగడకు సంబంధించి అనేక రకాల పరిశోధనలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి.బోర్నెమౌత్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి కీలక ఆధారాలను సేకరించారు.
అమెరికా నేలపైన ఎప్పటి నుంచో మానవుల మనుగడ ఉందని వారు గుర్తించారు.అంటే 13 నుంచి 16వేల ఏళ్ల క్రితమే అమెరికా గడ్డపై మానవులు సంచరించారనే ఆధారాలు లభ్యమయ్యాయి.
అయితే తాజాగా చేసిన పరిశోధనల ఫలితంగా ఆ ఆధారాలు తప్పని తేలింది.
బ్రిటన్, అమెరికాలకు చెందిన పురాతత్వ శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేశారు.
వారు చేసిన అధ్యయనంలో మెక్సికో లోని వైట్ శాండ్స్ నేషనల్ పార్క్ లో ఉన్న అల్కలీ ఫ్లాట్ సరస్సులో ఓ రాయి దొరికింది.ఆ రాయిపైన మనుషుల కాలి ముద్రలు బయటపడ్డాయి.

ఆ రాయిపై ఉన్నటువంటి పైపొర, లోపలి పొరలను రేడియో కార్బన్ డేటింగ్ విధానంలో పరిశోధన చేశారు.అమెరికన్ జియోలాజికల్ సర్వే నిపుణులు పరిశోధనలు చేసి కీలక ఆధారాలను సేకరించారు.ఆ రాళ్లు 23వేల ఏళ్లనాటివని గుర్తించారు.అంతేకాకుండా ఒకప్పుడు నేషనల్ శాండ్స్ ప్రాంతమంతా కూడా ఎడారి ప్రాంతంగా ఉనిందని పరిశోధకులు భావిస్తున్నారు.వారికి దొరికిన కాలి ముద్రలు పూర్తిగా నీటితో నిండి ఉండేవని తేలింది.దీంతో శాస్త్రవేత్తలు మానవ మనుగడ అనేది 23 వేల ఏళ్లకు ముందే ఉందని గుర్తించారు.