వైరల్: ఇలాంటి చిలుకలనిఎప్పుడూ చూసుండరు... సంథింగ్ స్పెషల్ ఇవి!

ఈరోజు స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చి చేరింది.దాంతో సోషల్ మీడియా వాడకం అనేది గణనీయంగా పెరిగిపోయింది.

 Viral Never Seen Parrots Like This Something Special , Parrots , Viral Latest ,-TeluguStop.com

దాంతో ప్రపంచం నలుమూలలా వున్న అనేక విషయాలు వైరల్ అవుతూ వున్నాయి.ఈ క్రమంలో జంతువులు, పక్షులు, చిన్నపిల్లలా తాలూక వీడియోలు అనేకం నెటిజన్లంటూ ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈ పని మనుషులు మాత్రమే చేయగలరా అని అనుకున్నాయేమో ఆ చిలుకలు… అచ్చం మనుషుల మాదిరిగానే చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి.

తాజాగా చిలుకలకు స్కేటింగ్ లో శిక్షణ ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పెంపుడు జంతువులు, పక్షులను పెంచుకునే వారి యజమానులు.తమ పెంపుడు జంతువుల నైపుణ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఈమధ్య పరిపాటి అయిపోయింది.అలాగే ఇలాంటి వీడియోలు ఇతరులకు కూడా కాస్త ప్రోత్సాహంలాగా ఉపయోగపడుతున్నాయి.ఓ మహిళ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో తన పెంపుడు చిలుకలకు స్కేటింగ్ లో శిక్షణ ఇస్తోంది.

కాగా ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

అంత విషయం అందులో ఏముందని అనుకుంటున్నారా? ఉందండి… తాను పెంచుకునే చిలుకలకు వోల్ఫీ, షార్కీ గా నామకరణం చేసి.ఈవీడియో క్లిప్ ను ఆమహిళ తన పెంపుడు చిలుకలకు అంకితం చేసింది.ఆచిలుకలు స్కేటింగ్ షూ పై ఎక్కి కిందపడిపోకుండా మలుపులు తిరుగుతూ వెళ్లడంపై నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియో మెచ్చిన ఆన్లైన్ ఆహుతులు అనేకరకాలుగా కామెంట్లు కురిపిస్తున్నారు.ఏదైనా సాధించాలనే తపన మనుషులకేనా.జంతువులు, పక్షులకు కూడా ఉంటుందని కొందరంటే, ఆ చిలుకలని చూసి నేర్చుకోండి… అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube