వైరల్: బాలీవుడ్ పాటకు అమెరికన్ కపుల్స్ మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్..!

బాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఉన్నారు.అందులోనూ షారుఖ్ ఖాన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

 Viral American Couples Mind Blowing Performance To Bollywood Song, Dancing Dad,-TeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు.తాజాగా షారుఖ్ ఖాన్ పాటకు అమెరికన్ రీకీ పాండ్ స్టెప్పులేశాడు.

గతంలో కూడా చూస్తే అమెరికన్ రికీ పాండ్ అనేక పాటలకు డ్యాన్సులు చేశారు.గతంలోనే ఈయన భోజ్ పురి పాట లాలీపాప్ కు డాన్స్ చేశాడు.

అలాగే అల్లు అర్జున్ బుట్ట బొమ్మ పాటకు కూడా స్టెప్పులు వేశాడు.తాజాగా ఆయన తనకు 25వ పెళ్లిరోజు కావడం వల్ల తన భార్యతో కలిసి సంతోషంగా రికీ పాండ్ స్టెప్పులు వేశాడు.

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, హీరోయిన్ కరీనా కపూర్ జంటగా నటించిన సూపర్ హిట్ సాంగ్ చమ్మక్ చల్లో అనే పాటకు ఆయన డాన్స్ వేసాడు.ప్రస్తుతం ఈ పాట నెట్టింట్లో సందడి చేస్తోంది.

వీళ్లు షారుక్ ఖాన్ పాటలు డాన్స్ వేయడమే కాకుండా భారత దేశానికి సంబంధించిన బట్టలు ధరించారు.

ప్రస్తుతం ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో వైరల్ అవుతుంది.

అమెరికన్ కపుల్స్ డాన్స్ కి అందరూ ఫిదా అవుతున్నారు.

ఈ మధ్యకాలంలో లేటెస్ట్ ఇండియన్ సాంగ్స్ ను విదేశీయులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.మంచి మంచి స్టెప్పులు వేయడం కాదు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వాటికి రెస్పాన్స్ బాగా వస్తోంది.ప్రస్తుతం రికీ పాండ్ అనే వ్యక్తి కూడా ఇలా తెలుగు పాటకు డ్యాన్స్ వేయడమే కాకుండా ఇప్పుడు బాలీవుడ్ పాటకు అందులోనూ షారుఖ్ ఖాన్ పాటకు డాన్స్ వేసి పాపులర్ అయ్యారు.

తన భార్యతో ఆయన వేసిన డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నెటిజన్లు ఈ పాటకు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.వారిని ప్రశంసిస్తున్నారు.వీడియో కు లైకుల వర్షం కురుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube