'కోబ్రా' తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్‌.. స్టార్‌ హీరో సినిమాకు ఇలాంటి పరిస్థితేంటి పాపం!

తమిళ స్టార్‌ హీరో చియాన్ విక్రమ్‌ తాజా చిత్రం కోబ్రా ను తెలుగు లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.కానీ ఇక్కడ సినిమా ను భారీ ఎత్తున ఏమో కానీ అసలు విడుదల చేయడం కష్టం గా ఉంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

 Vikram Cobra Movie Telugu Pre Release Business , Cobra, Cobra Movie Telugu, Movi-TeluguStop.com

హీరో విక్రమ్‌ గతంలో మంచి గుర్తింపును తెలుగు లో దక్కించుకున్నాడు.కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.

ఆయన ప్రస్తుతం తమిళం లో సినిమా చేస్తున్నాడు అంటే ఇక్కడ వారు ఎవరు పట్టించుకోడం లేదు.అందుకే ఆయన నటించిన కొన్ని సినిమాలను కనీసం తెలుగు లో డబ్‌ కూడా చేయలేదు.

తెలుగు ప్రేక్షకుల్లో విక్రమ్‌ పై ఆసక్తి తగ్గింది.అందుకే కోబ్రా సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు కనీసం పట్టించుకుంటున్న దాఖలాలు లేవు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు.

అయినా కూడా సాధ్యం అయినంత వరకు ఎక్కువ గా ఇక్కడ ప్రమోషన్ చేస్తున్నారు.ప్రీ రిలీజ్ బిజినెస్ కనీసం మీడియం రేంజ్ హీరో సినిమా స్తాయి లో కూడా బిజినెస్ చేయలేక పోతుంది.

దాంతో చాలా చోట్ల సొంతం గానే సినిమా ను నిర్మించే యోచనలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమా ప్రమోషన్‌ కోసం కాస్త ఎక్కువగానే ఖర్చు చేస్తున్నారట.

తెలుగు లో భారీ భారీ ఎత్తున విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమా కు మినిమం గా కూడా బజ్ క్రియేట్‌ అవ్వక పోవడంతో మేకర్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారట.సినిమా విడుదల అయిన తర్వాత ఏమైనా బజ్ క్రియేట్‌ అయ్యి సినిమా కు మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందేమో చూడాలి.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన వసూళ్లు మరియు టాక్ ఎలా ఉంటుందా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి ఫలితాన్ని ఈ సినిమా దక్కించుకున్నా కూడా కోలీవుడ్‌ లో మాత్రం కచ్చితంగా మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube