కోలీవుడ్ స్టార్ నటులలో విజయ్ సేతుపతి ఒకరు.ఈయన హీరోగా వెనుకబడి పోయిన క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయిన తర్వాత వరుస పాత్రలను ఒప్పుకుంటున్నాడు.
ఈయన చేస్తున్న పాత్రలకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది.అటు తమిళ్ లో మాత్రమే కాదు.
ఇటు టాలీవుడ్ లో సైతం ఈయనకు భారీ డిమాండ్ ఏర్పడింది.
విజయ్ సేతుపతి విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ నటనలో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు.
దీంతో ఇప్పుడు ఏ కీలక పాత్ర అయినా ముందు ఈయన దగ్గరికే వెళ్తుంది.మన తెలుగులో ఉప్పెన సినిమాలో ఫాదర్ కమ్ విలన్ గా కనిపించి తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు.
ఇక రీసెంట్ గా కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో కూడా ఈయన డ్రగ్ మాఫియా లీడర్ గా తన నటనలో విశ్వరూపాన్ని చూపించి ప్రేక్షకులను అబ్బుర పరిచాడు.
ఇక ఈ సినిమా విజయం విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించడంతో ఇప్పుడు ప్రతీ డైరెక్టర్ కూడా తమ సినిమాలోని కీలక మైన రోల్ కోసం ఈయననే సంప్రదిస్తున్నారని టాక్.
ఈయనకు అప్పట్లో పుష్ప సినిమాలో కూడా అవకాశం వచ్చిన డేట్స్ కారణంగా ఈయన తప్పుకున్నాడు.అయితే ఇప్పుడు పుష్ప 2 లో మాత్రం సుకుమార్ ఈయనను కీలక మైన విలన్ రోల్ కోడం తీసుకున్నట్టు టాక్ వచ్చింది.

ఇక ఇప్పుడు మరో భారీ బడ్జెట్ సినిమాలో ఈయనకు నటించే అవకాశం వరించినట్టు టాక్.బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో విలన్ పాత్రలో విజయ్ సేతుపతి ని ఫైనల్ చేశారట.రానా ఈ పాత్రలో నటిస్తాడని వార్తలు వచ్చిన అట్లీ మాత్రం విజయ్ ను ఫైనల్ చేశారట.ఈ పాత్రలో విజయ్ సేతుపతి తప్ప మరెవరు చేయలేరని డైరెక్టర్ భావించి ఈయననే తీసుకున్నారట.