తెలుగు సినిమాలతో సమానంగా పోటీ పడుతున్న 'లియో'... వారికి కష్టమే!

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్( Vijay ) నటించిన లియో సినిమా ను దసరా సందర్భంగా అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కు విక్రమ్‌ దర్శకుడు లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వం వహిస్తున్నాడు.

 Vijay Leo Movie Telugu Release Going To Very Big , Lokesh Kanagaraj , Bhagavant-TeluguStop.com

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా లియో ను రూపొందించినట్లుగా ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ ను చూస్తూ ఉంటే అనిపిస్తుంది.తప్పకుండా ఈ సినిమా రికార్డ్‌ ల వర్షం కురిపిస్తుంది అనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం లియో సినిమా ను ఇతర భాష ల్లో విడుదల చేసే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది.ప్రముఖ తెలుగు నిర్మాత లియో ను వెనుక ఉండి పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు గాను సిద్ధం అవుతున్నారు.అదే దసరా కానుకగా తెలుగు లో భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) తో బాలయ్య మరియు టైగర్‌ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) తో రవితేజ రాబోతున్న విషయం తెల్సిందే.అందుకే లియో సినిమాకు పెద్దగా స్కోప్ ఉండదేమో అనుకున్నారు.

కానీ ఇటీవల ఆన్‌ లైన్ లో ఒక జర్నలిస్ట్‌ పోల్‌ పెడితే దసరా కు బాలయ్య, రవితేజ సినిమాలతో సమానంగా లియో సినిమా ను చూడాలి అనుకుంటున్నట్లుగా సర్వే ఫలితం వచ్చింది.

అంటే ఈసారి విజయ్ సినిమా కు తెలుగు లో భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.అన్ని భాష ల్లో కూడా లియో టైటిల్‌ తో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి తీరుతుంది అంటూ విజయ్ అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.ఇక భారీ అంచనాలున్న లియో సినిమా లో హీరోయిన్ గా త్రిష( Trisha ) నటించిన విషయం తెల్సిందే.

కీలక పాత్ర లో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సంజయ్ దత్‌( Sanjay Dutt ) నటించాడు.కనుక బాలీవుడ్‌ లో కూడా ఈ సినిమా కు మంచి బజ్ క్రియేట్‌ చేయడం లో మేకర్స్ సఫలం అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube