కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి( Vijay Dalapati ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హీరో విజయ్ కి తమిళంతో పాటు టాలీవుడ్ లో కూడా భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందన్న విషయం మనందరికి తెలిసిందే.
కాగా హీరో విజయ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే గత ఏడాది విజయ్ వారసుడు( varasudu ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విజయ్ తదుపరి సినిమా షూటింగ్ లో భాగంగా బిజీగా ఉన్నాడు.

ఇది ఇలా ఉంటే కోలీవుడ్( Kollywood ) హీరో విజయ్ కి టాలీవుడ్ లో కూడా బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండడంతో విజయ్ నటించిన సినిమాలు అన్నీ కూడా తెలుగులోకి డబ్బింగ్ అవుతున్నాయి.ఇప్పటికీ చాలా సినిమాలు తెలుగులోకి విడుదలైన విషయం తెలిసిందే.ఇక ఆ సంగతి పక్కన పెడితే హీరో విజయ్ సినిమాలలో నటించడంతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా ముందుంటారు.ఇప్పటికే చాలా సందర్భాలలో ఆయన అనేక మందికి సహాయం చేసి రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్న విషయం తెలిసిందే.

తమిళనాడు( Tamil Nadu ) లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారు.తాజాగా మరోసారి సాయం చేసేందుకు విజయ్ ముందుకొచ్చాడు.విజయ్ మక్కల్ ఇ యక్కం తరపున తమిళనాడు లోని ప్రతి నియోజకవర్గంలోని ఈ ఏడాది 10వ తరగతి, 12వ తరగతుల్లో మొదటి స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఈనెల 17వ తేదీన ఆయన సన్మానించనున్నాడు.వారందరికీ కూడా రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని అందించనున్నాడు.ఉత్తీర్ణులైన విద్యార్థులకు మరింత ప్రోత్సాహం కల్పించేందుకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు విజయ్ పేర్కొన్నాడు.
ఈ నిర్ణయంతో విద్యార్థుల సమాచారం సేకరించాలని తన ఫ్యాన్స్‌కు ఆదేశాలు కూడా ఇచ్చేశాడు.