రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాన దర్శకత్వం లో ఖుషి సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.సమంత అనారోగ్య కారణాల వల్ల ఆ సినిమా చాలా ఆలస్యం అయ్యింది.
ఈ వారంలో మళ్లీ షూటింగ్ ప్రారంభించి రెండు నెలల్లోనే ముగించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.విజయ్ దేవరకొండ హీరోగా కొత్త సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో అధికారికంగా ప్రకటన వచ్చింది.
ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది.

భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న గౌతమ్ తిన్ననూరి సినిమా లో విజయ్ దేవరకొండ ను విభిన్నమైన పాత్రలో చూడబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.తప్పకుండా వీరిద్దరి కాంబో కు అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా సర్ ప్రైజ్ అవుతారని అంటున్నారు.రామ్ చరణ్ కోసం రెడీ చేసుకున్న కథ ను ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో సినిమా ను చేసేందుకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రెడీ అవుతున్నాడు.

విజయ్ దేవరకొండ మరియు గౌతమ్ తిన్ననూరి కాంబో మూవీ ఎప్పుడు ప్రారంభం అవ్వబోతుంది.ఎలా ఉంటుంది అనే విషయం లో క్లారిటీ లేదు.కానీ ఈ కాంబో సినిమా ను ఇదే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.అన్ని అనుకున్నట్లుగా జరిగితే విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాన దర్శకత్వం లో నటిస్తున్న ఖుషి సినిమా తో పాటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా తో కూడా ఇదే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
లైగర్ సినిమా తో తీవ్రంగా నిరాశ పర్చిన విజయ్ దేవరకొండ ఈ రెండు సినిమా లతో కచ్చితంగా సూపర్ హిట్ అందుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.గీత గోవిందం మరియు అర్జున్ రెడ్డి సినిమాల తర్వాత ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ ఆ స్థాయి విజయాలను సొంతం చేసుకోలేక పోయాడు.
అందుకే ఈ రెండు సినిమాలపై చాలా ఆశలు ఉన్నాయి.