రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ఎట్టకేలకు ఖుషి సినిమా తో ఒక భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.ఆ సినిమా విజయం లో సమంత కే ఎక్కువ క్రెడిట్ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేసినా కూడా రౌడీ ఫ్యాన్స్ ఆ విషయాన్ని పట్టించుకోకుండా మా వాడికి ఓ విజయం దక్కిందని అంటున్నారు.
ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా తో( Family Star ) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రౌడీ స్టార్ ఆ సినిమా లో ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) నటిస్తున్న విషయం తెల్సిందే.మరో వైపు కొత్త సినిమా ను గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో రౌడీ స్టార్ ప్లాన్ చేశాడు.
అందుకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టబోతున్నాడు.
ఆ సినిమా లో శ్రీ లీల ను( Sreeleela ) హీరోయిన్ గా ఎంపిక చేశారు.అయితే ఆ మధ్య సినిమా లో శ్రీ లీల కాకుండా రష్మిక మందన్నా నటించబోతుంది అన్నట్లుగా టాక్ వినిపించింది.అయితే హీరోయిన్ మార్పు విషయం పై క్లారిటీ ఇస్తూ రష్మిక మందన్నా మా సినిమా లో నటించడం లేదు అంటూ గౌతమ్ తిన్ననూరి( Gautam Tinnanuri ) టీమ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.
దాంతో రౌడీ స్టార్ మరియు రష్మిక ఎప్పుడెప్పుడు రొమాన్స్ చేసుకుంటారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే వీరిద్దరి పెళ్లి కూడా జరిగి ఉండేది.కానీ ఇప్పుడు వీరిద్దరు కెరీర్ పై దృష్టి పెట్టారు.ఇద్దరికి ఇద్దరూ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో దూసుకు పోతున్నారు.
కనుక ప్రేమలో ఉన్నా కూడా పెళ్లి ఇప్పుడు కాదు అన్నట్లుగా వాయిదా వేస్తున్నారు.పెళ్లి ఎలాగూ ఆలస్యం అయ్యేలా ఉంది.కనీసం వెండి తెరపై అయినా వీరి కాంబో లో సినిమా ను చూసి ఆనందించాలని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు.మరి వచ్చే ఏడాది లో అయినా వీరి ఆశ నెరవేరేనా చూడాలి.