రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda )చివరి సారి అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం సినిమాల తర్వాత సక్సెస్ ను దక్కించుకున్న దాఖలాలు లేవు.మొన్నటికి మొన్న లైగర్ సినిమా తో వచ్చిన విజయ్ దేవరకొండ ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకున్నాడో అందరికి తెల్సిందే.
అలాంటి విజయ్ దేవరకొండ ఎట్టకేలకు ఖుషి సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.అంతే కాకుండా లైగర్ వంటి డిజాస్టర్స్ పడ్డ సమయంలో వచ్చిన విమర్శ లకు సమాధానం చెప్పాడు.
ఖుషి సినిమా ( Khushi movie )సక్సెస్ నేపథ్యం లో రౌడీ స్టార్ భారీ వసూళ్లు సొంతం చేసుకుంటున్నాడు.దాదాపుగా వంద కోట్ల కు పైగా వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా ను పరశురామ్( Parashuram ) దర్శకత్వం లో చేస్తున్న విషయం తెల్సిందే.గీతా గోవిందం సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ఇదే అవ్వడం తో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో పరశురామ్ సినిమా ఉంటుందని అంటున్నారు.వీరి కాంబో లో గతంలో వచ్చిన గీత గోవిందం సినిమా( Geetha Govindam movie ) భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం తో పాటు, రౌడీ స్టార్ తాజా చిత్రం ఖుషి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో కొత్త సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

గీతా ఆర్ట్స్ బ్యానర్ ( Geeta Arts Banner )తో గొడవ పడి మరీ దర్శకుడు పరశురామ్ ఈ సినిమా ను విజయ్ దేవరకొండ తో చేస్తున్నాడు.కనుక ఈ సినిమా సక్సెస్ అయితేనే దర్శకుడు పరశురామ్ కెరీర్ సాఫీగా సాగుతుంది.అందుకే ఈ సినిమా చాలా పెద్ద భారం అన్నట్లుగా దర్శకుడు పరశురామ్ ఫీల్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.రౌడీ స్టార్ కి మరో విజయాన్ని అందిస్తే కచ్చితంగా పరశురామ్ క్రేజ్ రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి.