Viral Video : వీడియో: యూఎస్‌లో పెద్ద ఇల్లు కొన్న కూతురు.. పేరెంట్స్ రియాక్షన్ వైరల్..

పిల్లలను విద్య కోసం విదేశాలకు పంపడం అనేది తల్లిదండ్రులకు కఠినమైన నిర్ణయం, పిల్లలు వేరే దేశంలో స్థిరపడటానికి కష్టపడుతున్నప్పుడు కూడా పేరెంట్స్ చాలా ఎమోషనల్ అవుతుంటారు.వారిని ఒంటరిగా వదిలేశామని, వారు కష్టపడుతున్నారని, వారిని మిస్ అవుతున్నామని తల్లిదండ్రులు ఫీల్ అవుతారు.

 Video Viral Reaction Of Daughters Parents Who Bought A Big House In Us-TeluguStop.com

అయితే కొందరు పిల్లలు విదేశాలలో మంచిగా సెటిల్ అవుతూ పేరెంట్స్‌ని ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలా చేస్తుంటారు.

సాధారణంగా యూఎస్‌లో( US ) కొత్తింటికి మారడం, లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేయడం తలకు మించిన భారంగా ఉంటుంది.

ఈ ప్రక్రియలో చాలా పేపర్ వర్క్ ఉంటుంది.అందుకే ఇది మరింత సవాలుగా ఉంటుంది.అయితే ఒక భారతీయ మహిళ ( Indian woman )వీటన్నిటినీ అధిగమించి కొత్త ఇల్లు కొని తల్లిదండ్రులను ఆ ఇంటికి ఆహ్వానించింది.కూతురి సక్సెస్ చూసి పేరెంట్స్ ఎంతో సంతోషించారు.

వారికి సంబంధించిన ఓ హార్ట్ టచింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో యునైటెడ్ స్టేట్స్‌లో( United States ) తన మొదటి ఇంటిని కొనుగోలు చేసిన భారతీయ మహిళను మనం చూడవచ్చు, తల్లిదండ్రులు కూతురి కొత్త ఇంటిని చూసి ఆశ్చర్యపోతారు.మహిళ, ఆమె తల్లిదండ్రులు ఇంటి బయట నిలబడి ఉండటంతో వీడియో ప్రారంభమవుతుంది.లోపలికి వెళ్లిన తల్లిదండ్రులు ఇంటిని చూసి వావ్ అంటూ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారు.

తల్లి తన కూతురిని హత్తుకుంది.

ఈ మహిళ తన కొత్తింటి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది, ఈ వీడియోతో పాటు ఆమె తన ప్రయాణం గురించి, ఈ స్థాయికి చేరుకోవడానికి చేసిన కృషి గురించి మాట్లాడింది.సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు అమెరికా వెళ్లినప్పటి నుంచి ఐదేళ్లకు పైగా శ్రమించాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది.కలలు కనేలా, వారి తల్లిదండ్రులను గర్వపడేలా చేయాలని ఆమె ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తుంది.

ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంది, దీనికి మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్స్‌ వచ్చాయి.చాలా మంది ప్రజలు తమ ప్రశంసలను, అభినందనలను తెలియజేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube