విజయం కాంగ్రెస్ దే.. సూచన ఏది ?

తెలంగాణలో కాంగ్రెస్ ( Telangana Congress )అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు.80 సీట్లకు పైగా సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే నిజంగా హస్తం పార్టీ అధికారంలోకి వచ్చే సూచనలు ఉన్నాయా ? విశ్లేషకులు సైతం సమాధానం చెప్పలేని పరిస్థితి.ఎందుకంటే అధికార బి‌ఆర్‌ఎస్ బలహీన పడిందని భావిస్తే హస్తం పార్టీ నేతలు పప్పులో కాలేసినట్లే.

 Victory Belongs To Congress What Is The Hint , Telangana Congress , Brs Party,-TeluguStop.com

ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ లతో పోల్చితే బి‌ఆర్‌ఎస్ పార్టీ( BRS party )కి ప్రజామద్దతు ఎక్కువ అనే సంగతి అందరికీ తెలుసు.కానీ గత తొమ్మిదేళ్ల కాలంలో కే‌సి‌ఆర్ పాలన చూసిన ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటారనే భావనాతోనే కాంగ్రెస్ గాని, బీజేపీ గాని అధికారం కోసం తెగ ఆరటపడుతున్నాయి తప్పా.

వాస్తవానికి బి‌ఆర్‌ఎస్ ఏ మాత్రం బలహీన పడలేదని విశ్లేషకులు చెబుతున్నా మాట.

Telugu Brs, Congress, Dk Shivakumar, Karnataka, Rahul Gandhi, Revanth Reddy-Poli

ఈసారి 100 పైగా సీట్లు సాధిస్తామని బి‌ఆర్‌ఎస్ నేతలు ఫుల్ కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నారు.అందుకు తగ్గట్టుగానే ప్రజల్లోకి వెళుతున్నారు.ఇప్పటివరకు వస్తున్న సర్వేలన్నీ బి‌ఆర్‌ఎస్ కే పట్టం కడుతున్నాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనేది ఒట్టిమాటే అని కొట్టి పారేస్తున్నారు కొందరు.ఇదిలా ఉంచితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్( DK Shivakumar ) ఇటీవల తెలంగాణ వచ్చారు.

Telugu Brs, Congress, Dk Shivakumar, Karnataka, Rahul Gandhi, Revanth Reddy-Poli

ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత ఆసక్తిని కలిగిస్తున్నాయి.కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధిస్తుందని కచ్చితంగా అంచనా వేసి ముందే చెప్పారు డీకే.ఆయన అంచనకు తగినట్లుగానే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించింది.ఇక తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే స్థానాలను త్వరలోనే వెల్లడిస్తానని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సూచన ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

దీంతో నెక్స్ట్ ప్రచారానికి వచ్చినప్పుడు డీకే హస్తంపార్టీకి ఎన్ని సీట్లు విజయాన్ని అంచనా వేస్తారనేది ఆసక్తికరంగా మారింది.మరి డీకే అంచనాలు కర్నాటక లో మాదిరి కరెక్ట్ అవుతాయా ? లేదా ఒట్టి మాటగానే మిగిలి పోతయా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube