పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో హైదరాబాద్ నాంపల్లి కోర్టు తీర్పును వెలువరించింది.ఈ కేసులో రాకేశ్ రెడ్డిని దోషిగా నిర్దారించిన న్యాయస్థానం… నిందితులుగా ఉన్న మరో పదకొండు మందిని నిర్దోషులుగా పేర్కొంది.
ఇప్పటికే రాకేశ్ రెడ్డిని దోషిగా తేల్చింది నాంపల్లి కోర్టు.ఈ క్రమంలోనే శిక్ష తగ్గించాలని న్యాయస్థానాన్ని రాకేశ్ రెడ్డి కోరారు.
తన తల్లిదండ్రులు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని… కోర్టులో కంటతడి పెట్టుకున్నాడని తెలుస్తోంది.ఇదివరకే ఇరు పక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు నిందితుడి రాకేశ్ రెడ్డికి జీవిత ఖైదు విధించింది.