సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఏదో ఒక క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి పాషన్ తో వస్తారు అయితే ఇక్కడికి వచ్చాక మనం ఏం చేయాలి అనేది ఇండస్ట్రీ నే నిర్ణయిస్తుంది అనడానికి కొందరిని మనం ఉదాహరణ గా చెప్పుకోవచ్చు.వాళ్ళు ఎవరు అనేది ఒకసారి మనం చూద్దాం…
తనికెళ్ళ భరణి
ఈయన ఇండస్ట్రీ కి మొదట రైటర్ గా వచ్చి ఆ తరువాత నటుడి గా మారి చాలా బిజీ నటుడిగా గుర్తింపు పొందాడు.అలాగే తెలుగులో ఆయన చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఆయనకంటూ ఒక సెపరేట్ గుర్తింపు పొందాడు…అలాగే ఆయన బాలసుబ్రమణ్యం, శ్రీలక్ష్మి లాంటి సీనియర్ నటులని పెట్టీ మిథునం అనే సినిమాకి డైరెక్షన్ కూడా చేశాడు ఎంతైనా ముందు ఆయన ఒక రైటర్ గా ఇండస్ట్రీ కి వచ్చి టాప్ రైటర్ గా ఎదిగి తర్వాత నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకోవడం గ్రేట్ అనే చెప్పాలి…
పోసాని కృష్ణ మురళి
ఈయన రైటర్ గా ఒక 100కు పైన సినిమాలు చేశారు.మంచి సక్సెస్ ఫుల్ రైటర్ గా పేరు కూడా తెచ్చుకున్నాడు.ఆ తరువాత కొన్ని సినిమాలకి కూడా డైరెక్షన్ చేశాడు కానీ నాయక్ అనే సినిమా తో కమెడియన్ గా పేరు తెచ్చుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు…
ఎం.ఎస్ నారాయణ
ఈయన కూడా మొదట రైటర్ గా ఇండస్ట్రీ కి వచ్చి ఆ తరువాత ఈవీవీ గారి పుణ్యమాని కమెడియన్ గా చేసి తాగుబోతు పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ లా మారారు…
ఎల్బి శ్రీరామ్
ఎల్బీ శ్రీరామ్ కూడా హిట్లర్ లాంటి హిట్ సినిమాలకు డైలాగ్ రైటర్ గా చేశారు ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో ఆయనకి రైటర్ గా మంచి అవకాశాలు వచ్చాయి అవన్నీ చేస్తూ మంచి రైటర్ గా ఇండస్ట్రీ లో గొప్ప పేరు తెచ్చుకున్నారు ఆ తరువాత ఇవివి గారు తీసిన చాలా బాగుంది సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ జనాల్లో బాగా క్లిక్ అయింది దాంతో ఆయన అప్పటి నుండి కామెడీ పాత్రలు చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు…
.