అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్.అసెంబ్లీ కార్యాలయంలో నామినేషన్ వేసిన ఏడుగురు అభ్యర్థులు పోతుల సునీత,వివి సూర్యనారాయణ రాజు ,బొమ్మి ఇజ్రాయెల్ ,జయమంగళ వెంకటరమణ,మర్రి రాజశేఖర్,చంద్రగిరి ఏసురత్నం,కోలా గురువులు.
జయమంగల వెంకటరమణ కామెంట్స్.ఎన్టీఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎన్నో పదవులు చేసాను.బిసి గా నన్ను ప్రజలు ఆదరించారు.2019 ఎన్నికల్లో టీడీపీ బిసి లను ఓడ గొట్టేలా పని చేసింది.
నా అభిమానులకు క్షమాపణ చెబుతున్న.చంద్రబాబు నాకు ఎమ్మెల్సీ ఇస్తానని మాట తప్పారు.కామినేని నా భిక్ష తో మంత్రి అయ్యారు.నా నామినేషన్ విత్ డ్రా చేయించి కామినేనిని గెలిపించి ఎమ్మెల్సీ చేశారు.బెంజ్ కార్ లో తిరిగే నన్ను డొక్కు కార్ లో తిరిగేలా చంద్రబాబు చేశారు.జగన్ కు ధన్యవాదాలు.
నాకు ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చినందుకు వైసిపి సీఎం జగన్ కు ధన్యవాదాలు….
సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు.ఎమ్మెల్యే కోట లో ఎమ్మెల్సీ లు ఏడుగురు అభ్యర్థులు ఇవాళ నామినేషన్ల ను వేశారు.18 స్థానాల్లో సీఎం జగన్ సోషల్ ఇంజినీరింగ్ లో సామాజిక న్యాయం పాటిస్తూ…ఎమ్మెల్సీ ల ఎంపిక చేసారు.14 స్థానాలు బిసిలకు కేటాయించడం ఒక చరిత్ర.శాసన మండలి లో…30 మంది బిసి ఎస్సి ఎస్టీ మైనారిటీ లు ఉంటారు.
ఇది దేశం గర్వించ దగ్గ పరిణామం.రాజకీయ సాధికారత దిశగా సీఎం అవకాశాలు బట్టి సామాజిక న్యాయం చేస్తున్నారు…
.