మెగాస్టార్ సినిమాలో వెంకీ గెస్ట్ రోల్.. స్టార్ లతో నింపేస్తున్న చిరు!

లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వడమే కాకుండా వాటిని వ్యూహాత్మకంగా పూర్తి చేస్తూ వస్తున్నాడు.ఈ వయసులో కూడా ఇంత ఫాస్ట్ గా సినిమాలు పూర్తి చేయడం ఆషామాషీ కాదు.

 Venkatesh Guest Role In Megastar Chiranjeevi 154 Movie, Venkatesh, Waltair Veera-TeluguStop.com

ఏక కాలంలో రెండు సినిమాల షూటింగులు చేస్తూ యంగ్ హీరోల కన్నా బిజీ షెడ్యూల్స్ తో యాక్టివ్ గా సినిమాలను పూర్తి చేస్తున్నాడు.

ప్రెసెంట్ చిరు చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్) ఒకటి.

మెగాస్టార్ 154వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసుకుంది.

మాస్ రాజా రవితేజ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు ఈ సినిమాలో మరొక స్టార్ నటించ బోతున్నట్టు టాక్.

విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో కనిపించ బోతున్నారని.క్లైమాక్స్ లో ఈయన ఎంట్రీ ఉంటుంది అని.సరదాగా ఎంట్రీ ఇచ్చి అదరగొడతాడు అని.టాక్ ఇప్పుడు నెట్టింట ప్రచారం జరుగుతుంది.మెగాస్టార్, వెంకటేష్ ఒకే సినిమాలో చేయబోతున్నారు అనగానే మరిన్ని అంచనాలు పెరిగి పోయాయి.

Telugu Chiranjeevi, Bobby, Ravi Teja, Shruthi Hasan, Venkatesh, Venkateshguest-M

ఇదిలా ఉండగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube