మెగా హీరో వరుణ్ తేజ్( Mega Hero Varun Tej ) ఆపరేషన్ వాలెంటైన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించాడు.
పెళ్లికి ముందు షూటింగ్ పూర్తి చేసి, డబ్బింగ్ కూడా వరుణ్ చెప్పాడు.కానీ విడుదల విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈనెల 8న సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.విడుదలకు కనీసం వారం రోజుల సమయం లేదు.
అయినా కూడా ఇప్పటి వరకు ప్రమోషన్ కార్యక్రమాలు( Promotional programs ) షురూ చేయలేదు.దాంతో అసలు మ్యాటర్ ఏంటో అర్థం కావడం లేదు అంటూ కొందరు జుట్టు పీక్కుంటున్నారు.
భారీ అంచనాల నడుమ రూపొంది విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ను ప్రమోషన్ లేకుండా విడుదల చేస్తారా లేదంటే సినిమా వాయిదా పడబోతుందా అంటూ కొందరు అనమానాలు వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి రకరకాలుగా సినిమా విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పెద్ద ఎత్తున సినిమా పై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి.కానీ అక్కడ కూడా సినిమా గురించి హడావుడి కనిపించడం లేదు.
దాంతో అసలు ఆపరేషన్ వాలెంటైన్ సినిమా( Valentine movie ) విడుదల ఉందా లేదా అనే చర్చోప చర్చలు తెగ జరుగుతున్నాయి.ఈ విషయంలో వరుణ్ తేజ్ నోరు విప్పాల్సిన అవసరం ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం చాలా రకాలుగా సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.వరుణ్ తేజ్ గత చిత్రాలు ఏమాత్రం ఆశాజనకమైన ఫలితాన్ని చవిచూడలేదు.అయినా కూడా ఈ సినిమా ను చాలా లైట్ తీసుకుని విడుదల సమయంలో హడావుడి చేయడం లేదు.
వరుణ్ తేజ్ సినిమా ప్రమోషన్ కోసం ముందుకు రాకుండా ఇంకా పెళ్లి కొడుకు మాదిరిగా ఇంట్లోనే ఉంటే ఎలా అన్నట్లుగా కొందరు విమర్శిస్తున్నారు.ఇప్పటికి అయినా కొత్త పెళ్లి కొడుకు బయటకు రావాల్సిన అవసరం ఉంది.