త్వరలోనే లావణ్య వరుణ్ తేజ్ ల పెళ్లి.. వివాహానికి హాజరయ్యే గెస్ట్ లిస్టు ఇదే?

మెగా హీరో నాగబాబు( Naga Babu ) తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Mega Prince Varun Tej ) త్వరలో పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే.వరుణ్ తేజ్,హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత కొంతకాలంగా లవ్ ఉన్నారు.

 Varun Tej Lavanya Tripathi Went Go Italy For Their Marriage Here Is The Guest Li-TeluguStop.com

అయితే ఆ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.ఎట్టకేలకు ఆ వార్తలను నిజం చేస్తూ ఇటీవలె ఎంగేజ్మెంట్ వేడుకతో ఒకటి అయ్యారు.

త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు.ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

వీరి పెళ్లి ఇటలీలో జరగనుంది.ఇటీవల ఈ జంటకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

Telugu Guest List, Varun Tej-Movie

ఇక ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్‌ను( destination wedding ) జరుపుకుంటున్నారు.అందులో భాగంగా వరుణ్, లావణ్యలు వారికీ ఇష్టమైన దేశం ఇటలీలో పెళ్లి చేసుకుంటున్నట్లు ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది అది నిజం చేస్తూ.ఇటలీలోని టస్కానీలో( Tuscany, Italy ) ఈ జంట పెళ్లి చేసుకుంటున్నారు.ఈ పెళ్లి కూడా చాలా కొద్దిమంది సమక్షంలో జరుగునుంది.నవంబర్ 1న ఈ స్టార్ కపుల్ వివాహా బంధంతో ఒకటి కానున్నారు.ఇక ఇప్పటికే వీరిద్దరూ ఇటలీకి బయలుదేరి వెళ్లారు.

ఈ విషయాన్ని వరుణ్ తన ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించారు.ఇక వీరి పెళ్లి నాలుగు రోజుల పాటు జరగనుంది.

ఈ వేడుకకు అతి కొద్ది మంది మాత్రమే హాజరు కానున్నారు.

Telugu Guest List, Varun Tej-Movie

గెస్ట్ లిస్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్( Megastar Chiranjeevi, Pawan Kalyan ) లతో పాటు రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, సాయి ధరమ్‌ తేజ్ లు కూడా ఉన్నారు.వీరి ఎంగేజ్‌మెంట్ కూడా చాలా ప్రైవేట్‌గా జరిగిన సంగతి తెలిసిందే.అయితే రిషెప్షన్ మాత్రం గ్రాండ్‌గా ఉండనుందట.

ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ హాజరు కానున్నారట.ఇటీవల కాలంలో వరుణ్ తేజ్ వరసగా సినిమాల్లో నటిస్తన్న తెలిసిందే.

లావణ్య చాలా కాలం నుంచి ఈ సినిమాలకు దూరంగా ఉంటోంది.లావణ్య సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి కారణం వరుణ్ తేజ్ అని కూడా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube