Varun Tej Akira Nandan : ఇక చాలు తమ్ముడికి దిష్టి తగులుతుంది.. అకిరా పై వరుణ్ కామెంట్స్ వైరల్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈయన ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో నటించినటువంటి ఆపరేషన్ వాలెంటైన్( Operation Valentine ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

 Varun Tej Interesting Comments About Akira Nandan-TeluguStop.com

ఈ సినిమా మార్చి 1వ తేదీ విడుదల కాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఇటీవల ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేశారు.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అభిమాని పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్( Akira Nandan ) గురించి ప్రశ్నలు వేశారు.అకిరా నందన్ తో మీకు ఎలాంటి బాండింగ్ ఉంది అంటూ ప్రశ్నలు వేశారు.ఈ ప్రశ్నకు వరుణ్ సమాధానం చెబుతూ.

తమ్ముడితో నాకు చాలా స్పెషల్ బాండింగ్ ఉందని తెలిపారు.ప్రస్తుతం తమ్ముడు ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలలో చదువుతున్నారని తెలిపారు.

ఇంతకుమించి తమ్ముడు గురించి ఇకపై ఏమి చెప్పనని తనకు దిష్టి తగులుతుంది అంటూ వరుణ్ తెలిపారు.

ఇలా తమ్ముడు గురించి ఎక్కువ చెబితే దిష్టి తగులుతుంది అంటూ తన తమ్ముడు అకిరా పై ఉన్నటువంటి ప్రేమను వరుణ్ ఈ సందర్భంగా బయట పెట్టడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు( Pawan Kalyan Fans ) ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తమ్ముడు ఆకిరా అంటే వరుణ్ కి ఎంత ప్రేమ ఉందో ఈ మాటల్లోనే తెలిసిపోతుంది అంటూ ఈ వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సినీ ఎంట్రీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube