జబర్దస్త్ లో అవన్నీ నిజాలే... ఫేక్ కాదు.. అసలు విషయం చెప్పిన వర్ష!

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆర్టిస్టులు ప్రస్తుతం వెండితెరపై కూడా ఎంతో బిజీగా ఉంటున్నారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అతి తక్కువ సమయంలోనే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వారిలో వర్ష ఒకరు.

 Varsha Said The Real Thing About Jabardast Show By Saying That Are Real Not Fake-TeluguStop.com

కమెడియన్ ఇమ్మానియేల్ తో కలిసి జతకట్టిన ఈమె అతి తక్కువ సమయంలోనే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.ఇకపోతే తాజాగా జబర్దస్త్ కార్యక్రమం గురించి వర్ష మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియ చేశారు.

జబర్దస్త్ కార్య క్రమంలో కొందరు ఆర్టిస్టులు ఒక్కోసారి వేదికపై ఎంతో ఎమోషనల్ అవుతూ ఉంటారు.అయితే ఇలా ఎమోషనల్ కావడం కేవలం ఆ షో టీఆర్పి రేటింగ్స్ కోసమేనని అందరూ భావిస్తారు.

అయితే అలాంటి భావోద్వేగమైన సన్నివేశాలు టీఆర్పి రేటింగ్స్ కోసం చెయ్యమని అవన్నీ కూడా వాస్తవా లేనని ఈ సందర్భంగా వర్ష వెల్లడించారు.అప్పుడప్పుడు కొన్ని సంఘటనలతో నిజంగానే ఎమోషనల్ అవుతామని ఈ సందర్భంగా ఈమె తెలిపారు.

Telugu Jabardast Show, Telugu, Tollywood, Varsha-Movie

ఇకపోతే జబర్దస్త్ నటీనటుల మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని, వీరిలో ఏ ఒక్కరికి ఏదైనా కష్టం వచ్చినా అందరూ ముందుకు వచ్చి వారికి సహాయం చేస్తారని వర్ష తెలిపారు.ఇక ఈ కార్యక్రమం నుంచి ఎవరు వెళ్లిపోయినా తమ కుటుంబంలో ఒక సభ్యుడు వెళ్లిపోయిన విధంగా బాధ పడతారని తెలిపారు.ఇక పోతే తాను ఇది వరకే పలు సినిమాలలో నటించినా ప్రస్తుతం ఎలాంటి సినిమాలలోనూ చేయలేదని తనకు సినిమాల్లో నటించడం ఇష్టం లేదని తెలిపారు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తనకు ఎంతో మంచి గుర్తింపు వచ్చిందని బయటకు ఎక్కడికి వెళ్ళిన జబర్దస్త్ వర్ష అంటూ పిలవడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఈమె తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube