టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ( Sreeleela ) గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.శ్రీలీల పెళ్లి సందడి సినిమా ద్వారా వెండి తెరమీద అడుగు పెట్టింది.
ఈ సినిమా తర్వాత శ్రీలీల వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో దూసుకు పోతుంది.ఈ ఒక్క సినిమాతో ఈమె స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయిందనే చెప్పాలి.
అందం, అభినయం రెండు ఉన్న ఈ భామ కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది.
ఇటీవలే రవితేజ ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ ఇప్పుడు స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉంది.
ప్రస్తుతం ఈ భామ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.ఈ రోజు బర్త్ డే( Sreeleela Birthday ) కానుకగా ఈమె నటిస్తున్న సినిమాల నుండి ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి.
మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం, అలాగే బాలయ్య – అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న భగవంత్ కేసరి నుండి వచ్చిన పోస్టర్స్ బాగా ఆకట్టు కున్నాయి.
ఇక వైష్ణవ్ తేజ్ తో చేస్తున్న ఆదికేశవ నుండి చిన్న సర్ప్రైజ్ వీడియో రిలీజ్ చేయగా అందులో మరింత అందంగా ఆకట్టు కుంటుంది.ఇక తాజాగా కొద్దీ సేపటి క్రితం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) నుండి కూడా శ్రీలీల పోస్టర్ రిలీజ్ అయ్యింది.హరీష్ శంకర్ బర్త్ డే కానుకగా ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి బర్త్ డే విషెష్ తెలిపారు.
ఈ పిక్ లో పవన్ కళ్యాణ్ బ్యాక్ కనిపిస్తుంటే శ్రీలీల ఆయన ముందు నిలబడి ఉన్న క్యూట్ పోస్టర్ రిలీజ్ చేయగా ఇది ఫ్యాన్స్ లో మంచి వైరల్ అయ్యింది.మొత్తానికి అమ్మడి బర్త్ డే రోజు ఒకదానిని మించి మరొక పోస్టర్స్ ఉండడంతో ఆమె ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఇలాంటి అదృష్టం ఈ భామకు మాత్రమే దక్కింది అనే చెప్పాలి.