అమెరికా సంచలన నిర్ణయం...హిందూ మాసంగా అక్టోబర్ నెల...!!!

హిందూ సాంప్రదాయాలకు, సంస్కృతికి కొలువైన, నెలవైన పుణ్య భూమి ఈ భారత భూమి.సంగీతం, కళలతో దైవత్వాన్ని నింపుకున్న ఈ ధరణి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది.

 Us State Celebrates October Is Hindu Heritage Month , India, America, Texas, Flo-TeluguStop.com

ఋషులు, ఎందరో మహానుభావులు, వేదాలు, కలగలిసిన ఈ భారత దేశం ఆధ్యాతికతతో విరాజిల్లుతోంది.కేవలం భారత దేశంలో ఉన్న భారతీయులు మాత్రమే కాదు విదేశాలలో ఉన్న లక్షలాది మంది భారతీయులు హిందూ సంస్కృతీ సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించేలా ఎన్నో కార్యక్రమాలు సైతం చేపడుతూ ఉంటారు.

ఇక్కడ మరొక విషయం ఏంటంటే కేవలం విదేశాలలో ఉన్న భారతీయులు మాత్రమే కాదు విదేశీయులు సైతం మన సనాతన హిందూ ధర్మం పట్ల ఆకర్షితులు అవుతున్నారు.ఈ క్రమంలోనే ప్రతీ భారతీయుడు గర్వించేలా అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

అగ్ర రాజ్యం అమెరికాలో ఉన్న హిందూ సంఘాల కృషి ఫలితంగా అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.ప్రతీ భారతీయుడు గర్వించేలా అక్టోబర్ నెలను హిందూ మాసంగా ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

టెక్సాస్, ఫ్లోరిడా, న్యూజెర్సీ, ఒహాయో, అలాగే పలు రాష్ట్రాలకు చెందిన గవర్నర్ కార్యాలయాలు ఈ మేరకు కీలక ప్రకటన చేసాయి.అమెరికా లో హిందూ మతం, చరిత్ర అమెరికా అభ్యున్నతికి ఎంతో దోహదం చేశాయని తెలిపాయి.

ఇదిలాఉంటే అమెరికా ఫెడరల్ ప్రభుత్వం హిందూ మాసంగా అక్టోబర్ నెలను గుర్తించాలని, లక్షల ఏళ్ళ చరిత్ర కలిగిన హిందుత్వానికి గౌరవంగా తమ అభ్యర్ధనను పరిశీలించాలని కోరుతున్నారు.అమెరికాలో ఇప్పటికే లక్షలాది మంది హిందువులు ఉన్నారని, ప్రతీ ఒక్కరూ హిందుత్వాన్ని ప్రతీ ఒక్కరికి తెలియజేసేలా ప్రయత్నించాలని, కేవలం అమెరికాలో మాత్రమే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా హిందుత్వ గొప్పదనాన్ని చాటిచెప్పేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని అమెరికాలోని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు కోరుతున్నారు.

ఎన్నో ఏళ్ళుగా హిందూ సంఘాలు పడిన శ్రమకు అమెరికాలో పలు రాష్ట్రాలు గుర్తింపు ఇచ్చాయని వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కూడా అక్టోబర్ నెలను హిందూ మాసంగా గుర్తించాలని కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube