అమెరికా ఇచ్చిన భారీ ఆఫర్ వద్దనుకున్న భారత టీచర్..!!

అమెరికా వెళ్లాలని అక్కడ ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని ఎంతమందికి ఉండదు చెప్పండి, ప్రతిభ కలిగిన భారతీయులు ఎంతో మంది అమెరికా వెళ్లి తమ అత్యున్నతమైన ప్రతిభ ఆధారంగా అక్కడే స్థిరపడి నేడు భారత్ గర్వపడే స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్నారు.

విద్య కోసమో, ఉద్యోగ, వ్యపార ఇలా ఏదో ఒక రంగంలో అమెరికా వెళ్లి స్థిరపడాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు.

అయితే ఓ భారత టీచర్ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.సదరు భారత టీచర్ ను అమెరికా వచ్చేయమని నెలకు లక్షల్లో జీతం ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు అక్కడి కొన్ని విద్యా సంస్థలు.

ఇంతకీ అమెరికానే పిలిచి మరీ ఆఫర్ ఇచ్చేంత ప్రతిభ ఆయనలో ఏముంది అనుకుంటున్నారా.హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సిమ్లా కు చెందిన వీరేంద్ర కుమార్ అనే ఉపాధ్యాయుడి గురించి తెలియని వాళ్ళు ఉండరు.

మనకంటే కూడా విదేశాలలో ఎంతో మందికి ఆయన గురించి బాగా తెలుసు.ఆయనలో దాగున్న అత్యుత్తమమైన ప్రతిభ ఏంటంటే.

Advertisement

మనం రాసే చేతిరాత ఎంతో అందంగా ఉండేలా తీర్చి దిద్దడమే.ఏంటి ఆశ్చర్యపోతున్నారా.

ఇది ఎంతో చిన్న విషయంగా అనిపిస్తోందా.అయితే ఇంకొంచం వివరంగా ఆయన గురించి చెప్పాల్సిందే.

చాలా మంది చదువుల్లో చక్కగా రాణిస్తారు, ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉంటారు కనీ వారి చేతి రాత విషయంలో మాత్రం విజయాన్ని సాధించలేరు, చాలా మంది ఈ విషయంలో ఎంతో మధన పడుతూ ఉంటారు.అలాంటి వారి చేతి రాతను తన నైపుణ్యంతో అందంగా మార్చుతారు వీరేంద్ర కుమార్.

ఇప్పటి వరకూ ఆయన దాదాపు 80 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.ఇక్కడ మీరు గమనించాల్సింది ఆయన శిక్షణ ఇచ్చింది 80వేల మంది ఉపాధ్యాయులకు, విద్యార్ధులు లెక్కకు మించిన వారు ఆయన దగ్గరకు వస్తుంటారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

చేతి రాతను ఎంతో అందంగా తీర్చి దిద్దడమే కాలిగ్రఫీ అంటారు.కాలిగ్రఫీ లో ఆయన ఎంతో నైపుణ్యం సాధించిన వ్యక్తి 2018 లో ఆయన ఈ శిక్షణ తరగతులు ప్రారంభించారు.

Advertisement

సిమ్లాలో విద్యార్ధులు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్న సమయంలోనే ఆయన సోషల్ మీడియా ద్వారా విదేశాలలో వారికి శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టారు.దాంతో విదేశాలలో సైతం ఆయన గురించి తెలియడంతో అమెరికాలోని ఓ కాలేజీ యాజమాన్యం ఆయనకు నెలకు రూ.5 లక్షలు పైగా జీతం ఆఫర్ చేస్తూ ఆహ్వానం అందించింది.అయితే తాను ఎక్కడికి రానని, తన దేశంలో విద్యార్ధులను తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందని, దేశ విదేశాల నుంచీ వచ్చే ఆఫర్లు అన్నిటిని తిరస్కరించారు.

అందుకే ఆయన ఎంతో మంది ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు స్పూర్తిగా నిలిచారు.

తాజా వార్తలు