అగ్రరాజ్యంగా, ప్రపంచ పెద్దన్నగా, అత్యంత సంపన్న దేశమైన అమెరికాలో నల్లజాతీయుల( Black people in America ) పట్ల నేటీకీ వివక్ష కొనసాగుతుండటం సిగ్గుచేటు.శతాబ్దాలుగా అమెరికా సమాజంలో భాగమైన నల్లజాతీయులు నేటీకీ అక్కడ ద్వీతీయశ్రేణి పౌరులుగా జీవిస్తున్నారనడానికి ఎన్నో ఉదాహరణలు.
ఇక రెండేళ్ల క్రితం జరిగిన జార్జి ఫ్లాయిడ్( George Floyd ) హత్య అయితే నిలువెత్తు నిదర్శనం.ఫ్లాయిడ్‌ను ఓ తెల్లజాతి పోలీసు కర్కశంగా హతమార్చిన తీరు సమాజాన్ని నివ్వెరపరిచింది.
ఈ ఘటనను యావత్ ప్రపంచం నిరసించింది.న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, జార్జియా, ఇల్లినాయిస్, నార్త్ కరోలినా, మిచిగాన్, మేరీలాండ్, లూసియానా, తదితర రాష్టాల్లో నల్లజాతీయులు అధికసంఖ్యలో ఉన్నారు.

తాజాగా నల్లజాతీయుడి మరణానికి కారణమైన శ్వేతజాతి పోలీస్ అధికారిని జ్యూరీ దోషిగా తేల్చింది.2019లో ఓ నల్లజాతి వ్యక్తిని చోక్‌హోల్డ్ ( Chokehold )(వెనుక నుంచి మెడను గట్టిగా పట్టుకోవడం) లో వుంచడంతో పాటు అతనికి కెటామైన్ ఇంజెక్ట్ చేసి మరణానికి కారణమైన కేసులో బాధ్యుడైన పోలీస్ అధికారిని గురువారం దోషిగా నిర్ధారించింది.అమెరికా పశ్చిమ రాష్ట్రమైన కొలరాడోలోని జ్యూరీ.అరోరాకు చెందిన పోలీస్ ఆఫీసర్ రాండీ రోడెమా( Randy Rodema ) .ఎలిజా మెక్‌క్లెయిన్ అనే వ్యక్తి మరణించిన ఘటనలో నేరపూరిత నరహత్యకు పాల్పడినట్లు నిర్ధారించింది.ఇదే కేసులో రోడెమా సహోద్యోగి జాసన్ రోసెన్‌బ్లాట్ నిర్దోషిగా విడుదలయ్యాడు.
పోలీసులతో పోరాడిన కొద్దిరోజుల తర్వాత మెక్‌క్లైన్( McClain ) మరణించాడు.శక్తివంతమైన మత్తుమందు కెటామైన్‌ను ఇంజెక్ట్ చేయడం వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయాడు.
ఈ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే అమెరికా సమాజం తీవ్రంగా స్పందించింది.బాధితుడికి న్యాయం చేయాలని ప్రజలు, పౌర హక్కుల నేతలు, ప్రముఖులు సైతం అన్‌లైన్ పిటిషన్ నిర్వహించారు.

కాగా.ఓ అనుమానాస్పద నల్లజాతి వ్యక్తి మాస్క్ ధరించి రోడ్డుపై విచిత్రంగా ప్రవర్తిస్తూ వున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.ఘటనాస్థలికి చేరుకున్న తర్వాత మృతుడు.ఓ పోలీస్ అధికారి వద్ద వున్న తుపాకీని లాక్కొనే యత్నం చేశాడని పోలీసులు ఆరోపించారు.కానీ ఈ ఆరోపణలకు ఎలాంటి మద్ధతు లభించలేదు.మెక్‌క్లైన్ కుటుంబం మీడియాతో మాట్లాడుతూ.
తమ బిడ్డ ఐస్ టీ కోసం మార్కెట్‌కు వెళ్లాడని చెప్పారు.రక్తహీనతతో బాధపడుతూ వున్నందున శరీరాన్ని వెచ్చగా వుంచుకోవడానికి మాస్క్ ధరించాడని తెలిపారు.
ఇక ఈ కేసులో మెక్‌క్లైన్‌ను చోక్‌హోల్డ్‌లో వుంచిన మూడవ అధికారి నాథన్ వుడ్‌యార్డ్‌ను త్వరలో విచారిస్తామని జ్యూరీ ప్రకటించినట్లుగా మీడియా నివేదించింది.పారామెడిక్స్.
పీటర్ సిచునిక్, జెరెమీ కూపర్‌లను నవంబర్‌లో విచారించనున్నారు.