యూకేలో 'లియో' ఆల్ టైం రికార్డ్.. హిస్టరీ క్రియేట్ చేస్తుందా?

దసరా బరిలో మూడు భారీ సినిమాలు ఉన్నాయి.మరి వాటిలో కోలీవుడ్ నుండి రాబోతున్న ‘లియో’ సినిమా( LEO movie ) ఒకటి.

 Vijay's Leo Breaks Box Office Record Even Before Release, Leo, Thalapathy Vija-TeluguStop.com

దళపతి విజయ్ జోసెఫ్ ( Thalapathy Vijay )సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘లియో’.ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఎందుకంటే అటు విజయ్ క్రేజ్ ఇటు లోకేష్ క్రేజ్ కలిసి ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.అందులోను ఈ కాంబో ఇంతకు ముందు కూడా వచ్చి బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమాపై ఆడియెన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మొన్న సంక్రాంతికి వారిసు సినిమాతో వచ్చిన విజయ్ ఈసారి దసరా బరిలో ”లియో” సినిమాతో రాబోతున్నాడు.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.

ఇటీవలే మాసివ్ ట్రైలర్ ను రిలీజ్ చేసి ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కు చేర్చారు.‘లియో’ సినిమాలో విజయ్ కు జంటగా స్టార్ హీరోయిన్ త్రిష ( Trisha )నటిస్తుంది.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ ( Anirudh Ravichandran )సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్ నుండి రోజురోజుకూ క్రేజ్ పెరిగి పోతుంది.తాజాగా యూకే మార్కెట్ గురించి అక్కడి డిస్టిబ్యూటర్స్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.యూకేలో ఈ సినిమా ఒక్క తమిళ్ నుండే కాకుండా మొత్తం ఇండియా నుండే ఏ సినిమాకు రాని రెస్పాన్స్ దీనికి వచ్చినట్టుగా తెలిపారు.దీంతో లియో అక్కడ ఆల్ టైం హైయెస్ట్ డే 1 అందుకున్న సినిమాగా నిలిచినట్టు వారు చెబుతున్నారు.

మరి రిలీజ్ కు ముందే ఈ సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ ఉంటే రిలీజ్ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube