బాక్సర్ దెబ్బకు తొలిసారి తండ్రయిన హీరో

టాలీవుడ్‌లో ఇతర భాషలకు చెందిన సీనియర్ హీరోలు క్యారెక్టర్ పాత్రల్లో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.వీరిలో కన్నడకు చెందని సుదీప్, ఉపేంద్ర లాంటి వారికి మంచి క్రేజ్ కూడా ఉందని చెప్పాలి.

 Upendra To Play Father Role For First Time In Boxer, Upendra, Varun Tej, Boxer,-TeluguStop.com

ఇక ఉపేంద్రకు కన్నడనాటే కాకుండా తెలుగులో కూడా అదిరిపోయే ఫాలోయింగ్ ఉందనే విషయం తెలిసిందే.ఆయన హీరోగా నటించిన పలు చిత్రాలు ఇక్కడ కూడా మంచి విజయాలను అందుకోవడమే దీనికి నిదర్శనం.

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నిత్యామీనన్ అన్న పాత్రలో నటించి మెప్పించిన ఉపేంద్ర, ఇప్పుడు ఏకంగా తండ్రి పాత్రకు మారుతున్నాడు.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ ‘బాక్సర్’లో వరుణ్‌కు తండ్రిగా ఉపేంద్ర నటించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో తండ్రీకొడుకుల మధ్య ఉండే బాండింగ్‌ను దర్శకుడు కిరణ్ కొర్రపాటి అత్యద్భుతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట.

ఈ సినిమాకు ఉపేంద్ర యాక్టింగ్ అదనపు బలంగా మారనుందట.

ఇక ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులు అయినా షూటింగ్ మాత్రం మొదలు కాలేదు.దీంతో బాక్సర్ ఎప్పుడు బరిలోకి దిగుతాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.బాలీవుడ్ బ్యూటీ సాయి మాంజ్రేకర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోండగా థమన్ అదిరిపోయే సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube