బిగ్‌బాష్‌ లీగ్ లో మొదటి భారతీయ ఆటగాడిగా ఉన్ముక్త్ రికార్డ్..!

బిగ్‌బాష్‌ టి20 లీగ్‌ టోర్నీలో మ్యాచ్‌ ఆడిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా ఉన్ముక్త్‌ చంద్‌ గుర్తింపు పొందాడు.మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ జట్టు తరుపున హోబర్ట్ హరీకేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేసిన ఉన్ముక్త్ చంద్… 8 బంతుల్లో 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

 Unmukth Record With First Indian Player In Big Bash League Details, Unmukth ,ne-TeluguStop.com

సందీప్ లమిచాన్ బౌలింగ్‌ లో భారీ షాట్‌కి ప్రయత్నించి, బౌండరీ లౌన్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఉన్ముక్త్ చంద్.హోబర్ట్‌ హరికేన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌ లో మెల్‌బోర్న్‌ రెనెగెడ్స్‌ తరఫున ఉన్ముక్త్‌ బరిలోకి దిగి ఆరు పరుగులు చేశాడు.

2012లో భార‌త్‌ అండర్-19 ప్రపంచకప్‌ ను గెలవడంలో ఉన్ముక్త్‌ మెరుగైన పాత్ర పోషించాడు.ఆ తర్వాత ., ఐపీఎల్ 2013లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరుపున ఆరంగ్రేటం చేసాడు.ఢిల్లీ తరపున ఆడిన తర్వాత, చంద్ రాజస్థాన్ రాయల్స్‌కు మారాడు.

అతనికి రాయల్స్‌లో ఎక్కువ సమయం లేడు.ఆ తర్వాత అతను ముంబై ఇండియన్స్ లో చేరాడు.2015 సీజన్‌లో తన తొలి ఐపీఎల్ ఫిఫ్టీని నమోదు చేయడం ద్వారా ఐదు ఇన్నింగ్స్‌లలో 102 పరుగులు చేశాడు.అనంత‌రం ఉన్ముక్త్ 2016లో తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.

తర్వాత టీమిండియాలో అవకాశం కోసం ఎదురుచూసి, నిరాశగా యూఎస్‌కి వలసెళ్లి పోయాడు.

Telugu Australia, Big Bash League, Hobert, Latest, Indial, Cup, Unmukth Chand-La

అండర్-19 వరల్డ్ కప్ విజయం తర్వాత వచ్చిన క్రేజ్‌తో విరాట్ కోహ్లీ, ధోనీ లతో కలిసి ఓ కూల్‌డ్రింక్ యాడ్‌లో కూడా నటించాడు.అయితే, బీసీసీఐ రూల్స్‌ ప్రకారం భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆటగాళ్లకే విదేశీ టి20 లీగ్‌లలో ఆడే అర్హత ఉంది.దాంతో 28 ఏళ్ల ఉన్ముక్త్‌ గత ఆగస్టులో రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

కాగా, తాజాగా బిగ్‌బాష్ లీగ్‌ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన ఉన్ముక్త్ చంద్, ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వడం లేదని, వెకేషన్‌‌కి వచ్చినట్టు ఉందంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube