ఓ మైనర్ బాలిక హత్యాచారం కేసులో కొత్త మలుపు మళ్లించి.ఆ బాలికపై అత్యాచారం జరగలేదని పోస్టుమార్టం రిపోర్టులు రావడంతో పోలీసులు అయోమయంలో పడ్డారు.
పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర దినజ్ పూర్ జిల్లా సోనార్ పూర్ ప్రాంతంలో పదో తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థి హత్యాచారం కేసులో మరో మలుపు.తమ కూతురిని రేప్ చేసి చంపారని బాలిక తల్లిదండ్రలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.బాలిక పార్థివ దేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు నివేదించిన రిపోర్టులు ఒక్కసారిగా అందరికి షాక్ గురి చేశాయి.
ఈ నివేదిక వల్ల మైనర్ బాలిక హత్యాచారానికి పాల్పడిందని భావించిన వారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.బాలిక విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావించి ఆ దిశగా విచారించారు.
ఈ ఘటనకు ప్రధాన కారకుడైన ఫిరోజ్ అనే యువకుడు సోమవారం ఊరి చివర ఉన్న చెరువులో శవమై తేలడంతో అతడిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
కాగా, పోలీసులు పోస్టుమార్టం రిపోర్టులు మార్చి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని బాలిక తల్లిదండ్రులు, బంధులు ఆందోళనకు దిగారు.
దీంతో పోలీసులు జుట్టు పిక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.ఫిరోజ్ చనిపోవడానికి గల కారణాలను వెతకసాగారు.
ఫిరోజ్ ఆత్మహత్య చేసుకున్నాడా.లేదా ఎవరైనా చంపి చెరువులో పడేశారా.
అనే కోణం విచారణ మొదలు పెట్టారు.స్థానికుల సమాచారం ప్రకారం ఫిరోజ్, మైనర్ బాలికకు మధ్య కొంత కాలంగా ప్రేమ వ్యవహారం కొనగుతోందని తెలిసి, వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి ఆత్మహత్య చేసుకుని ఉంటారా అనే అనుమానాలు నెలకొని ఉన్నాయి.
కేసులు ఛేదించే దిశగా ప్రయత్నాలు సాగించారు పోలీసులు.