సాధారణంగా రాజకీయ నాయకులపై కోపంతోనే లేదా అవమానించాలనే ఉద్దేశ్యంతోనో కోడిగుడ్లు, చెప్పులు ఇలా తమకు నచ్చిన వస్తువులను విసిరి కొడుతుంటారు ప్రజలు.మనదేశంలో ఎమ్మెల్యే, ఎంపీ, సీఎంలపై చెప్పులు, కోడిగుడ్లు విసిరారు కానీ అది చాలా అరుదు.
ఇక మన ఇండియాలో ప్రధానమంత్రుల పై ఇలాంటి దాడులు ఎప్పుడూ జరిగింది లేదు.కానీ విదేశాల్లో మాత్రం ప్రధానమంత్రి హోదాకు సమానమైన అధ్యక్షులపై అవమానకరమైన దాడులు జరిగిన సందర్భాలు కోకొల్లలు.
తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పై కూడా ఒక దాడి జరిగింది.ఒక వ్యక్తి మాక్రాన్ పై ఉడికించిన కోడిగుడ్డును విసిరాడు.
ఈ ఘటన లియాన్ సిటీలో అంతర్జాతీయ క్యాటరింగ్, హోటల్ & ఫుడ్ ట్రేడ్ ఫెయిర్ (SIRHA)ను మాక్రాన్ సందర్శిస్తున్న సమయంలో చోటు చేసుకుంది.ఈ షాకింగ్ ఘటనలో ఉడికించిన కోడిగుడ్డు మాక్రాన్ భుజానికి తాకి కిందపడిపోయింది.
తాజాగా మాక్రాన్ రెస్టారెంట్స్ టిప్స్ పై సరికొత్త మార్పులను తీసుకొచ్చారు.ఇకపై క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించే రెస్టారెంట్ టిప్స్ పై పన్ను విధించమని ఆయన ప్రకటించారు.
ఈ ప్రకటన చేయడంతో రెస్టారెంట్ యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేశాయి.ఈ నేపథ్యంలోనే మేక్రాన్ ఫెయిర్ అటెండెన్స్‌తో సాదరంగా స్వాగతం అందుకున్నారు.ఈ శుభ సందర్భంలో ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఊహించని రీతిలో చేదు అనుభవం ఎదురైంది.ఒక ఆగంతకుడు అధ్యక్షుడిపై కోడి గుడ్డు విసిశాడు.
ఈ సంఘటన జరగగానే అప్రమత్తమైన భద్రతా అధికారులు వెంటనే ఆ ఆగంతకుడిని గుర్తించి నిర్బంధించారు.అనంతరం అక్కడి నుంచి ఆ దుండగుడిని బయటకి లాక్కెళ్లారు.ఈ ఘటన తర్వాత అధ్యక్షుడు మాక్రాన్ స్పందించారు.సదరు దుండగుడు తనపై ఎందుకు గుడ్డు విసరాల్సిన అవసరం వచ్చిందో అడిగి తెలుసుకుంటానన్నారు.

ఇక ఫ్రెంచ్ నిరసనకారులు తమ దేశ రాజకీయ నాయకులపై గుడ్లు విసరడం ఎప్పట్నుంచో జరుగుతోంది.ఇందుకు అధ్యక్షుడు మాక్రాన్ కూడా మినహాయింపేమీ కాదని తాజా ఘటనతో నిరూపితం అయింది.2017లో మాక్రాన్ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఉన్నప్పుడు కూడా పారిస్‌లోని జాతీయ వ్యవసాయ మేళాలో ఓ వ్యక్తి గుడ్డు విసిరాడు.ఆ గుడ్డు మాక్రాన్ తలపై పుట్టుక్కుమంది.