గురుపత్వంత్ పన్నూన్‌కు షాక్ .. ఎస్ఎఫ్‌జేపై ఐదేళ్ల నిషేధం , హోంశాఖ నిర్ణయానికి ఆమోదం

1980వ దశకంలో ఖలిస్తాన్ ( Khalistan )వేర్పాటు వాదం భారతదేశంలో రక్తపుటేరులు పారించిన సంగతి తెలిసిందే.పాకిస్తాన్ సహా కొన్ని శక్తుల మద్ధతుతో పంజాబ్‌కు చెందిన కొందరు సిక్కులు ప్రత్యేక ఖలిస్తాన్ దేశాన్ని కోరుతూ మారణహోమం సృష్టించారు.

 Uapa Tribunal Confirms Centre's Decision To Ban Pannun's Sfj For 5 Yrs , Khalist-TeluguStop.com

ఈ పరిణామాలు. ఆపరేషన్ బ్లూస్టార్( Operation Bluestar ), ప్రధాని ఇందిరా గాంధీ హత్య, సిక్కుల ఊచకోత, పంజాబ్‌లో హింసాత్మక పరిస్థితుల వరకు దారి తీశాయి.

తర్వాతి కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్పాటువాదాన్ని అణచివేయడంతో పంజాబ్‌లో శాంతి నెలకొంది.అయితే ఆయా దేశాల్లో స్థిరపడిన సిక్కుల్లో వున్న కొందరు ఖలిస్తానీ అనుకూల వాదులు నేటికీ ‘‘ఖలిస్తాన్’’ కోసం పోరాడుతూనే వున్నారు.

Telugu Amritpalsingh, Khalistan, Blue, Primeindira, Uapatribunal-Telugu NRI

కొద్దినెలల క్రితం వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ ( Amritpal Singh is the chief of Punjab )పంజాబ్‌ను వణికించడంతో పాటు ఖలిస్తాన్ ఉద్యమాన్ని రగిల్చే ప్రయత్నం చేశాడు .అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాకచక్యంగా వ్యవహరించి అతనిని అరెస్ట్ చేశాయి.ఈ సమయంలో భారత్ సహా కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, యూకే దేశాలలో ఖలిస్తాన్ మూకలు విధ్వంసం సృష్టించాయి.ఈ అల్లర్ల వెనుక నిషేధిత ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ సారథ్యంలోని సిఖ్స్ ఫర్ జస్టిస్ ( Sikhs for Justice )(ఎస్ఎఫ్‌జే) హస్తం ఉందని భారత నిఘా ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి.

Telugu Amritpalsingh, Khalistan, Blue, Primeindira, Uapatribunal-Telugu NRI

తాజాగా ఎస్ఎఫ్‌జేకు షాక్ తగిలింది.ఈ సంస్థను మరో ఐదేళ్ల పాటు నిషేధిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.దీనిని చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) ట్రిబ్యునల్ (UAPA Tribunal ) ధృవీకరించింది.కేంద్రం ఇచ్చిన ఆధారాల అనుగుణంగా ఖలిస్తానీ టెర్రరిస్ట్ గ్రూప్‌లైన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్, ఎస్ఎఫ్‌జేలను నిషేధించింది.

పంజాబ్‌లో మిలిటెన్సీని పునరుద్ధరించడానికి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ వీటికి సహాయం చేస్తోందని ట్రిబ్యునల్ నిర్ధారించింది.గతేడాది జూలై 9న ఎస్‌ఎఫ్‌జేని కేంద్రం ఐదేళ్లు నిషేధించగా.దీనిని ధ్రువీకరించాల్సిందిగా యూఏపీఏ ట్రిబ్యునల్‌ను కోరింది.తాజాగా అన్ని ఆధారాలను పరిశీలించిన మీదట కేంద్రం నిర్ణయాన్ని ట్రిబ్యునల్ సమర్ధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube