కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న క్రమంలో పలు దేశాలు ఇప్పటికే విదేశీ ప్రయాణీకుల ఎంట్రీ పై బ్యాన్ ఎత్తేశాయి.అయితే గతంలో కేవలం భారత్ మినహా అన్ని దేశాలకు తమ దేశంలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఇచ్చిన యూఏఈ ఇప్పుడు భారత ప్రయాణీకులు కూడా తమ దేశంలోకి రావచ్చని ప్రకటించింది.
అయితే భారతీయ ప్రయాణీకులకు మాత్రం కొన్ని మార్గదర్సకాలు విడుదల చేసింది.దుబాయ్, షార్జా, పుజిరహా వంటి పలు యూఏఈ కంట్రీస్ జారీ చేసిన వీసాలు ఉన్న భారతీయులను అబుదాబి లోకి వచ్చేందుకు అనుమతులు ఇచ్చింది.
కానీ భారత్ నుంచీ వచ్చే ప్రయాణీకులు ఎవరైనా సరే అక్కడి కరోనా నిభందనలు పాటించాల్సిందే నని ప్రకటించింది.ఈ మేరకు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సైతం భారతీయ ప్రయాణీకుల ఎంట్రీ కి షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నట్లుగా ప్రకటించింది.ఇంతకీ భారత ప్రయాణీకులు అక్కడ పాటించాల్సిన మార్గదర్సకాలు ఏంటంటే.
– భారత ప్రయాణీకులు భారత్ నుంచీ బయలు దేరే ముందు భారత్ లోని విమానాశ్రయంలో ర్యాపిడ్ పీసిఆర్ టెస్ట్ చేయించుకోవాలి.
– తమ జర్నీకి 48 గంటల ముందు తీసుకున్న పీసిఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.అయితే ఈ సర్టిఫికెట్ గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచీ పొందాలి.సర్టిఫికెట్ పై QR కోడ్ తప్పనిసరిగా ఉండాలి.
– ఇక ఐఏసి అనుమతి తప్పనిసరి.ఈ అనుమతులు వచ్చిన తరువాత ఐఏసి స్మార్ట్ రిజిస్ట్రేషన్ వెబ్సైటు లో నమోదు చేసుకోవాలి.అయితే తమ పౌరులకు మాత్రం ఇందులోంచి మినహాయింపు ఇచ్చింది యూఏఈ.
– విమానాశ్రయం నుంచీ బయలు దేరే ముందు వ్యాక్సిన్ వేసుకున్న సర్టిఫికెట్ చూపించాలి.
– అబుదాబి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న తరువాత మళ్ళీ పీసిఆర్ టెస్ట్ చేసుకోవాలి.
– వ్యాక్సిన్ వేసుకొని ప్రయాణీకులు ఎవరైనా ఉంటే అబుదాబి వెళ్ళిన తరువాత క్వారంటైన్ లో తప్పకుండా ఉండాల్సిందే.అంతేకాదు క్వారంటైన్ లో ఉన్న సమయంలో చేతికి వేసే రిస్ట్ బ్యాండ్ వేస్తారు.క్వారంటైన్ పూర్తయ్యే వరకూ అది చేతికి ఉండాల్సిందేనట.9 వర రోజున మళ్ళీ పీసిఆర్ టెస్ట్ ఉంటుంది.