కరోనా కారణంగా ఆర్ధికంగా అన్ని దేశాలు నష్టాలను చవి చూశాయి.ఈ పరిస్థితుల నుంచీ బయటపడేందుకుగాను చేయని ప్రయత్నాలు లేవు.
ముఖ్యంగా వలస వాసులు కరోనా సమయంలో తాము ఉండే వలస దేశాలు విడిచి సొంత ప్రాంతాలకు వెళ్ళిపోయినా తరువాత పలు వ్యవస్థలు దెబ్బ తినడంతో ఇప్పుడు ఆ ఆర్ధిక నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రణాలికలు సిద్దం చేసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే యూఏఈ తమ దేశం నుంచీ వెళ్ళిన విదేశీయులను మళ్ళీ రప్పించేందుకుగాను సరికొత్త వీసా ను ప్రవేశపెట్టింది.
పాత వీసాలో కొన్ని మార్పులు చేర్పులు చేసి వలస వాసులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ వీసాను రూపొందించామని యూఏఈ పేర్కొంది.
వివరాలలోకి వెళ్తే.
యూఏఈ వెళ్లాలనుకునే వలస వాసులు ఎవరికైనా అక్కడ వారు పనిచేసే సంస్థ స్పాన్సర్ చేస్తేనే కాని వీసా లభించదు, తప్పనిసరిగా వలస వాసులు పనిచేసే సంస్థ యాజమాన్యం ఈ వ్యక్తి మా సంస్థలో పనిచేస్తున్నాడు, ఇతనిని తమ సంస్థ నుంచీ స్పాన్సర్ చేస్తున్నామని పత్రం ఇస్తేనే గాని యూఏఈ లోకి అడుగు పెట్టలేము.అయితే కరోనా కారణంగా ఆందోళన కరంగా మారిన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు యజమాని ఇచ్చే స్పాన్సర్ షిప్ ను యూఏఈ రద్దు చేస్తూ కొన్ని మార్పులు చేసింది.
ఇకపై యూఏఈ వెళ్ళే వారు ఎవరైనా సరే గ్రీన్ వీసా కు అప్ప్లై చేసుకోవాలని సూచించింది.ఈ గ్రీన్ వీసా వలన యూఏఈ లో పనిచేయలనుకునే వారు ఎవరైనా సరే అక్కడి సంస్థల యోక్క్ స్పాన్సర్ షిప్ అవసరం లేదని తెలిపింది.
అంతేకాదు మరో సౌకర్యం కూడా ఈ వీసాలో కల్పించింది అదేంటంటే ఈ గ్రీన్ వీసా తో తమ తల్లి తండ్రులకు కూడా దాదాపు 25 వరకూ వీసా పొందే అవకాసం ఉందని ప్రకటించింది.యూఏఈ తాజా నిర్ణయం ఎంతో మంది భారతీయ నిపుణులకు ఊరట కలిగించిందని ప్రస్తుత పరిస్థితులలో సంస్థ స్పాన్సర్ షిప్ తీసుకోవడం ఇబ్బందిగా ఉందని, యూఏఈ తాజా నిర్ణయంతో తాము సంతోషం వ్యక్తం చేస్తున్నామని అంటున్నారు భారతీయ వలస కార్మికులు.