బాలయ్య కోసం రంగంలోకి ఇద్దరు!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాయి.

 Two Villains In Balakrishna Movie, Balakrishna, Boyapati Sreenu, Bb3, Villain-TeluguStop.com

దీంతో ఇప్పుడు ముచ్చటగా మూడోసారి జతకట్టిన బాలయ్య-బోయపాటి ఎలాంటి సినిమాతో వస్తారా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.అయితే ఈసారి కూడా తమ కాంబో పూర్తి మాస్ ఎంటర్‌టైనర్ మూవీతో రానున్నట్లు ఈ సినిమా టీజర్‌తో చెప్పేశారు.

ప్రస్తుతానికి BB3 అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మాస్ యాక్షన్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దేందుకు రెడీ అవుతున్నాడు బోయపాటి.ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

ఇక ఈ సినిమాతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.

దీంతో ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టేందుకు ఇద్దరు విలన్‌లను దించేందుకు రెడీ అయ్యాడు బోయపాటి.

ఈ క్రమంలోనే బాలీవుడ్ నటులను ఈ సినిమాలో విలన్‌లుగా దింపేందుకు రెడీ అవుతున్నాడు బోయపాటి.

ఇందులో ముఖ్యంగా బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌తో పాటు సౌత్ నుండి మరో స్టార్ విలన్‌ను ఈ సినిమాలో తీసుకోవాలని ఆయన ప్రయత్నిస్తు్న్నాడట.ఇక విలన్‌లతో బాలయ్య చేసే యాక్షన్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తీసుకొస్తాయని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన ఓ కొత్త బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తోంది.త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube