పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం తర్వాత గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రం వకీల్ సాబ్.అంతా అనుకున్నట్లుగా జరిగి ఎలాంటి అవాంతరాలు వచ్చి ఉండకుంటే ఇప్పటి వరకు పింక్ రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేది.
ఇదే సమయంలో క్రిష్ దర్శకత్వంలో విరూపాక్ష చిత్రాన్ని కూడా పవన్ మొదలు పెట్టేవాడు.కాని కరోనా కారణంగా మొత్తం ప్లాన్ అస్థవ్యస్థం అయ్యింది.
ఏమాత్రం ఊహించని విధంగా పరిస్థితులు మారిపోయాయి.
రెండు నుండి మూడు వారాల షూటింగ్ మాత్రమే వకీల్ సాబ్‌కు మిగిలి ఉందని కనుక ఆ మొత్తంను కూడా త్వరలోనే పూర్తి చేసి ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లుగా ప్రచారం జరిగింది.
కొన్ని రోజుల క్రితం అన్నపూర్ణ స్టూడియోలో వకీల్ సాబ్ చిత్రీకరణ ప్రారంభం అయ్యిందని కూడా వార్తలు వచ్చాయి.కాని అసలు విషయం ఏంటీ అంటే ఇప్పటి వరకు పవన్ వకీల్ సాబ్ షూటింగ్ పున: ప్రారంభం గురించి ఆలోచించలేదట.

ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ వచ్చే వరకు షూటింగ్స్‌కు వెళ్లడం ప్రమాదంగా భావిస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు.యూనిట్ సభ్యుల అందరి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే షూటింగ్‌కు వెళ్ల కూడదని నిర్ణయించుకున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.అంటే కరోనాకు వ్యాక్సిన్ వచ్చేప్పటి వరకు వకీల్ సాబ్ అలాగే ఉండాల్సిందే అంటున్నారు.మరి తదుపరి చిత్రాల విషయం ఏంటీ అనేది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.