అగ్ర రాజ్యం అమెరికాలో ట్రంప్ హయాంలో భారతీయులపై జాత్యహంకార దాడులు ఎక్కువగా జరిగేవి.ఈ దాడులలో ఎంతో మంది ప్రవాస భారతీయులు మృతి చెందిన సంఘటనలు, మరెంతో మంది గాయాలపాలైన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.
అయితే ఈ సంఘటనలపై విచారణ ఇప్పటికి కొనసాగుతూనే ఉంది.తాజాగా ఓ భారతీయుడిని కాల్చి చంపిన ఘటన అమెరికాలో కలకలం సృష్టించింది.
భారతీయ అమెరికన్ పై దాడి చేసిన ఇద్దరు అమెరికన్స్ ను దోషులుగా గుర్తించిన కోర్టు వారికి ఉరి శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.వివరాలలోకి వెళ్తే.
భారత సంతతికి చెందిన రూప్ సి గుప్తా అనే వ్యక్తి అమెరికాలోని ఓహియోలో మదీనా బేవరేజ్ కన్వియన్స్ అనే స్టోర్ నడుపుతున్నారు.అయితే ఈ ఇదే ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన తన స్టోర్ లోకి విల్లీ జేమ్స్ మరియు జాన్సస్ అనే ఇద్దరు అమెరికన్స్ ప్రవేశించారు.
వచ్చీ రావడంతోనే తమ వద్ద ఉన్న తుపాకులు తీసి గుప్తా పై గురిపెట్టారు.తన వద్ద ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేయమని డిమాండ్ చేశారు.గుప్తా చేసేది లేక తనను వదిలేయమని డబ్బు మొత్తం దుండగుల చేతిలో పెట్టేశాడు.కానీ వారు గుప్తాను అత్యంత కిరాతకంగా కాల్చి చంపేసి అక్కడి నుంచీ పారిపోయారు.
అయితే ఆ షాపులోని సిసి కెమెరా రికార్డులు ఆధారంగా ఇద్దరు దుండగులను పట్టుకున్న పోలీసులు పూర్తి విచారణ చేసిన తరువాత సాక్ష్యాదారాలతో సహా కోర్టు ముందు హాజరుపరిచారు.ఈ కేసును విచారించిన ఒహియో ఫెడరల్ కోర్టు సుదీర్ఘ విచారణ తరువాత తాజాగా వారిని దోషులుగా గుర్తించి తీర్పు చెప్పింది అయితే తుది తీర్పును మాత్రం వాయిదా వేసింది కోర్టు.
ఈ ఇద్దరు దుండగులు అదే రోజున మరో రెండు దొంగతనాలు చేశారని, పెద్ద మొత్తంలో డబ్బు కాజేశారని తేల్చారు.భారతీయుడిని దోచుకోవడమే కాకుండా అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన ఈ ఇద్దరికీ ఉరి శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు నిపుణులు.