మాటల మాంత్రికుడు త్రివిక్రం ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు.మొన్నటిదాకా భీమ్లా నాయక్ సినిమా హడావిడిలో ఉన్న త్రివిక్రం మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రం తన నెక్స్ట్ సినిమా పవర్ స్టార్ తో సినిమా చేస్తాడని టాక్.అయితే ఆ తర్వాత సినిమా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఉంటుందని అంటున్నారు.
ప్రస్తుతం లైగర్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా కూడా పూరీ జగన్నాథ్ తోనే చేస్తాడని తెలుస్తుంది.
ఇక నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ డైరక్షన్ లో కూడా ఒక సినిమా ఉంది.
ఆ తర్వాత త్రివిక్రం తో విజయ్ దేవరకొండ సినిమా ఉంటుందని అంటున్నారు.త్రివిక్రం లాంటి క్లాస్ డైరక్టర్ కి విజయ్ దేవరకొండ లాంటి మాస్ హీరోతో సినిమా అంటే ఆ మూవీ ఓ రేంజ్ లో ఉంటుంది.
తన సినిమాల లైనప్ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చేస్తాడని తెలుస్తుంది.లైగర్ తో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న విజయ్ దేవరకొండ రానున్న సినిమాలతో కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు.