ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ట్రెజరీ బిల్లుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది.దీనిపై విచారణ చేపట్టిన ఐటీ శాఖ ఉప ఖజానా కార్యాలయాల్లో బోగస్ టీడీఎస్ బిల్లులు క్లైమ్ చేసినట్లు తెలిపింది.
మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు, వాయల్పాడు, పుంగనూరులో టీడీఎస్ బోగస్ క్లైమ్ లను అధికారులు గుర్తించారు.కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము బోగస్ క్లైమ్ ల రూపంలో సొంత ఖాతాలకు ట్రెజరీ అధికారులు మళ్లించుకున్నారని సమాచారం.
ఈ స్కామ్ కు కారణమని భావిస్తోన్న ముగ్గురు టీటీవోలకు చార్జీ మెమోలు జారీ చేశారు.