మునుగోడు నియోజకవర్గంలో మరోసారి పోస్టర్లు కలకలం సృష్టించాయి.మర్రిగూడలో లంబాడీ హక్కుల పోరాట సమితి పేరుతో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.
ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందంటూ పోస్టర్లలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గల్లీలో లంబాడీల సీట్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ దుష్ట రాజకీయం చేస్తోందంటూ పోస్టర్లు వెలిశాయి.అమ్ముడుపోం.
బానిసలం కాదు.లంబాడీ బిడ్డలం అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు.
అదేవిధంగా ఖబర్దార్ బీజేపీ అంటూ లంబాడీ హక్కుల పోరాట సమితి హెచ్చరికలు జారీ చేసింది.అయితే రోజుకో ఊరిలో రోజుకో రకంగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే.







