మరికాసేపటిలో టీపీసీసీ కార్యవర్గ సమావేశం

తెలంగాణలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తుంది.ఈ మేరకు నగరంలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది.

 Tpcc Working Group Meeting Soon-TeluguStop.com

ఇందులో భాగంగానే హైదరాబాద్ లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించనుంది.మరికాసేపటిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది.

ఇందులో ప్రధానంగా నగరంలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించనుంది.కాగా ఈనెల 16, 17 వ తేదీల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే 16న సీడబ్ల్యూసీ సభ్యులకే సమావేశం పరిమితం కాగా ఈనెల 17న సీడబ్ల్యూసీతో పాటు పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు కూడా భేటీ కానున్నారు.అనంతరం అదే రోజు భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది.

ఈ సభా వేదికపై నుంచి టీపీసీసీ ఐదు గ్యారంటీ పథకాలను ప్రకటించనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube