ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా బోయపాటి శ్రీను( Boyapati Srinu ) దర్శకత్వంలో రూపొందిన స్కంద సినిమా విడుదలకు సిద్ధం అయింది.సలార్ సినిమా విడుదల అవ్వాల్సి ఉండగా క్యాన్సిల్ అయిందని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యం లో రామ్ సినిమా కి మంచి ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు.ఇక ఈ సినిమా కు ముందు రామ్ చాలా సినిమా లు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి.
అయినా కూడా రామ్ కి ఈ సినిమా పై చాలా నమ్మకం ఉన్నట్లుగా ఆయన మాటలను బట్టి అర్థం అవుతోంది.

హీరోగా రామ్( Ram Pothineni ) ఈ సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే రాబోయే కాలంలో యంగ్ స్టార్ హీరోలకు పోటీ అన్నట్లుగా నిలవచ్చు.అందుకే స్కంద పై చాలా ఆశలు పెట్టుకుని వెయిట్ చేస్తున్నాడు.బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఈ సినిమా కు ముందు అఖండ సినిమా ( Akhanda )వచ్చింది.
ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం వల్ల ఈ సినిమా పై బజ్ క్రియేట్ అయింది.ఈ సినిమా ను రామ్ కోసం కాకుండా దర్శకుడు బోయపాటి శ్రీను కోసం చూడాలి అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో బోయపాటి శ్రీను సినిమాలకు మంచి ఆధరణ ఉంది.

ఆయన సినిమా లు వస్తున్నాయి అంటే ఒక వర్గం ప్రేక్షకులు చాలా ఆసక్తిని కనబర్చుతూ ఉంటారు.ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ఈ సినిమాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.అందుకే రామ్ కోసం కాకుండా స్కంద ను చాలా మంది నెటిజన్స్ బోయపాటి కోసం అయినా చూడవచ్చు అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా లో ప్రస్తుతం స్కంద కి మంచి ఫాలోయింగ్ ఉంది.కనుక స్కంద మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
స్కంద సినిమా( Skanda Movie ) పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది.ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తోంది.