తెలుగు చిత్ర పరిశ్రమ గురించి పేరు ఎత్తగానే మనకు మొదటగా ఎన్టీఆర్( NTR ) పేరే గుర్తుకు వస్తుంది.ఎన్టీఆర్ పౌరాణిక, జానపద, ఫాంటసీ, సాంఘిక, సూపర్ హీరో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జానర్లలో సినిమాలు చేశారు.
ఏ పౌరాణిక పాత్ర వేసినా అందులో పరకాయ ప్రవేశం చేయడం ఎన్టీఆర్ ప్రత్యేకత.పాతాళ భైరవి( Pathala Bhairavi ) సినిమాలో మామూలు తోటరాముడిగా కూడా కనిపించి అదరగొట్టారు.
గుండమ్మ కథ, మాయాబజార్ వంటి క్లాసికల్ సినిమాల్లో కూడా ఆయన పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.మొదటి తరం హీరోల్లో ఎన్టీఆర్ కి వచ్చిన పాపులారిటీ ఎవరికీ రాలేదని చెప్పుకోవచ్చు.
ఎన్టీఆర్ యమగోల,( Yamagola ) అడవి రాముడు,( Adavi Ramudu ) వేటగాడు, జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్ ఇతర సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేశారు.ఈ లెజెండరీ యాక్టర్ టైమ్‌లో ఏఎన్ఆర్, శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, కాంతారావు తదితరులు కూడా రాణించారు.
కానీ ఎన్టీఆర్ ని బీట్ చేయలేకపోయారు.ఆ కాలంలో ఎన్టీఆర్ కింగ్ అని చెప్పవచ్చు.
ఎన్టీఆర్ తర్వాత మళ్లీ అంతటి పేరు వచ్చింది ఒక చిరంజీవికే అని చెప్పుకోవచ్చు.ఎన్టీఆర్ తరం ముగిశాక చిరు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.
బ్రేక్ డాన్సులతో, ఇంటెన్స్ ఫైట్లతో, మాస్ డైలాగులతో చిరంజీవి( Chiranjeevi ) తెలుగు సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు.
తెలుగు చిత్ర పరిశ్రమ చిరంజీవికి ముందు, చిరంజీవికి తరవాత అనేలా మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు.ఖైదీ, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ముఠామేస్త్రీ, ఇంద్ర, ఠాగూర్ వంటి సినిమాలతో చిరు మెగాస్టార్ గా మారిపోయాడు.టాలీవుడ్ సెకండ్ జనరేషన్ టైమ్ లో చిరుతో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ బాగానే పోటీపడ్డారు.
కానీ చిరు రేంజ్ లో మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం సంపాదించలేకపోయారు.మెగాస్టార్ లాగా ఎక్కువగా బిగ్గెస్ట్ హిట్స్ కొట్టలేకపోయారు.
మెగాస్టార్ తరం కూడా ముగిసిపోయింది.ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ తరం నడుస్తోంది.వీరందరూ మంచి హిట్స్ అందిస్తూనే ఉన్నారు.భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వీరి సొంతం.కానీ ఈ తరంలో ఎవరూ కూడా సింగిల్ టాప్ హీరోగా నిలవలేక పోతున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు ఎత్తగానే ఇప్పుడు ఒక్కరి పేరే గుర్తు వచ్చేలాగా ఉండటం లేదు.
చిరు, ఎన్టీఆర్ రేంజ్ లో వీరు ఛాలెంజింగ్ పాత్రలు, సన్సేషనల్ హిట్స్, ట్రెండ్ సెట్టింగ్స్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేయకపోవడమే కారణమై ఉండొచ్చు.మళ్లీ ఒక ఎన్టీఆర్, చిరంజీవి లాంటి పేరు తెచ్చుకునే హీరో తెలుగులో పుట్టడేమో అని ఆయా హీరోల ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.