సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్స్ సాధారణం అనే సంగతి తెలిసిందే.అయితే భారీ బడ్జెట్లతో తెరకెక్కిన సినిమాలు కొన్నిసార్లు అంచనాలను అందుకోలేక ఫ్లాప్ కావడం వల్ల సినిమాలకు భారీ నష్టాలు వస్తుంటాయి.
అయితే హీరోలు ఆ సమయంలో తమ పారితోషికాలలో కొంత మొత్తాన్ని వెనక్కు ఇచ్చి నిర్మాతలను ఆదుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి.సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు వెనక్కు ఇచ్చే సెలబ్రిటీలలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకరు.
బాబా సినిమా ఫ్లాప్ అయిన సమయంలో డిస్ట్రిబ్యూటర్లకు తన పారితోషికంలో ఎక్కువ మొత్తాన్ని రజనీకాంత్ వెనక్కిచ్చారు.ఈ విషయంలో అప్పట్లో రజనీకాంత్ పై ప్రశంసలు వ్యక్తమయ్యాయి.
మరో స్టార్ హీరో పవన్ కళ్యాణ్ జానీ, అజ్ఞాతవాసి మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో తన పారితోషికంలో కొంత మొత్తాన్ని వెనక్కిచ్చేశారు.టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ సైతం తన సినిమాలు ఫ్లాప్ అయిన సమయంలో పారితోషికాలను వెనక్కిచ్చిన సందర్భాలు ఉన్నాయి.
పడి పడి లేచే మనసు సినిమా ఫ్లాప్ అయిన సమయంలో రెమ్యునరేషన్ వద్దని సాయిపల్లవి కోరగా నిర్మాత మాత్రం ఆమె పారితోషికంను ఇచ్చారని సమాచారం.సాహో సినిమా ఫ్లాప్ అయిన సమయంలో ప్రభాస్ తన రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని భరించారు.భరత్ అనే నేను సక్సెస్ సాధించినా ఒక ఏరియాలో కొంతమేర నష్టాలు రావడంతో మహేష్ ఒక డిస్ట్రిబ్యూటర్ కు నష్టాలను భర్తీ చేసి మంచి మనస్సును చాటుకున్నారు.
ఖలేజా సినిమా సమయంలో నిర్మాతకు నష్టం వస్తే మహేష్ ఆదుకున్నారని బోగట్టా.వినయ విధేయ రామ, ఆచార్య సినిమాలు ఫ్లాప్ కాగా రామ్ చరణ్ కొంతమేర రెమ్యునరేషన్ వెనక్కిచ్చారు.ఆరెంజ్ సినిమాకు అయితే చరణ్ ఏకంగా రెమ్యునరేషన్ తీసుకోలేదు.
చిరంజీవి, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ కూడా నిర్మాతలకు నష్టాలు వచ్చిన సమయంలో తమ వంతు సహాయం చేశారు.