బీచ్‌లో స్నానం చేస్తున్న అమ్మాయిలకు షాక్.. త్రుటిలో ప్రాణం దక్కింది

బీచ్‌లో స్నానం చేయడం అంటే చాలా మందికి ఇష్టం.ముఖ్యంగా విదేశీయులు తరచూ బీచ్‌ స్నానం చేస్తూ ఉల్లాసంగా గడుపుతుంటారు.

 Man Spotted Shark Swimming Few Feet Away From Woman Details, Beach, Bathing, Vir-TeluguStop.com

ఇదే కోవలో ఆస్ట్రేలియాలోని పెర్త్ వెలుపల ఉన్న హిల్లరీస్ డాగ్ బీచ్‌లో కొందరికి షాక్ తగిలింది.ఊహించని ప్రమాదం వారిని వెంటాడింది.

స్నానం చేస్తున్న అమ్మాయిల వద్దకు ఓ బారీ షార్క్ వచ్చేసింది.దానికి నోటికి ఆ అమ్మాయి చిక్కి ఉంటే ఆ షార్క్ కరకరా నమిలేసేది.

అయితే ఏమైందో తెలియదు.అకస్మాత్తుగా ఆ షార్క్ అమ్మాయి దగ్గర వరకు వెళ్లి, వెనక్కు వెళ్లిపోయింది.

ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

షార్క్ చేపలు అంటే చాలా మంది తెలుసు.

అవి సముద్రంలో చిన్న చిన్న చేపలన్నింటినీ మింగేస్తాయి.వాటికి మనుషులు కనిపించినా అమాంతంగా మింగేస్తాయి.

అలాంటి షార్క్ బారి నుంచి ఎవరైనా బయటపడితే వారు నిజంగా అదృష్టవంతులనే చెప్పాలి.సరిగ్గా ఇదే అనుభవం ఆస్ట్రేలియాలోని కొందరికి ఎదురైంది.

డిసెంబర్ 28న హిల్లరీస్ డాగ్ బీచ్‌లో కొంత మంది అమ్మాయిలు స్విమ్మింగ్ చేస్తున్నారు.అయితే వారికి దగ్గరగా ఆ సమయంలో ఓ షార్క్ వచ్చిందని వారికి తెలియదు.

వారి పనిలో వారు ఉండగా ఓ ప్రమాదకర భారీ షార్క్ ఆ అమ్మాయిలకు దగ్గరగా వచ్చింది.కేవలం కొద్ది అడుగుల సమీపం వరకు వచ్చింది.

అయితే అకస్మాత్తుగా అక్కడి నుంచి ఆ షార్క్ సముద్రంలోకి తిరిగి వెళ్లిపోయింది.ఈ దృశ్యాలను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించారు.ఈ వీడియోను జనవరి 2న సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది.ఈ వీడియోను సామ్ వుడ్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ వాండర్‌లస్ట్ ఫ్లైయర్‌లో పోస్ట్ చేశాడు.

తమ పెంపుడు కుక్కలతో పాటు నీళ్లలో ఉన్న ఈత కొట్టేవాళ్లకు షార్క్ మీటర్ల దూరంలో వచ్చిందని ఆయన చెప్పాడు.తాను బీచ్‌లో పరుగెత్తి, స్నానం చేస్తున్న ప్రజలను నీటిలో నుండి బయటకు తీసుకురావాలని అరిచానని పేర్కొన్నాడు.

అదృష్టవశాత్తూ ఆ షార్క్ మానవులపై పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube