బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇతని పూర్తి పేరు కమల్ ఆర్ ఖాన్.
కానీ కేఆర్కే గానే అందరికీ సుపరిచితం.తరచూ ఎవరో ఒకరిపై సంచలన వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.
మరి ముఖ్యంగా సినిమాల రివ్యూల విషయంలో ఎక్కువగా వార్తలో నిలుస్తూ ఉంటాడు కేఆర్కే.ఎక్కువగా బాలీవుడ్ సినిమా సెలబ్రిటీలపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటాడు.
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ సినిమాలకు సంచలన రివ్యూలతో వార్తల్లో నిలుస్తూ ట్రోలింగ్స్ కు గురవుతూ ఉంటాడు.ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పఠాన్ సినిమాపై కేఆర్కే కే స్పందిస్తూ.షారుక్ ఖాన్ సినిమా టైటిల్ పఠాన్, బేషరం రంగ్ సాంగ్ కనిపించవు అంటూ సంచలన ట్వీట్ చేసాడు.
పఠాన్ సినిమా కూడా వాయిదా వేస్తారని తన ట్వీట్లో పేర్కొన్నాడు కేఆర్కే.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ బాలీవుడ్ సినీవర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.
కాగా మొన్నటికి మొన్న కేఆర్కే ట్వీట్ చేస్తూ పఠాన్ మూవీ రివ్యూ లాస్ట్ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.కాగా తాజాగా కేఆర్కే తన ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చాడు.
పఠాన్ టైటిల్ ఇక ఉండదు.అలాగే ఆరెంజ్ బికినీ కూడా ఇందులో కనిపించదు.
ప్రస్తుతం ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్మాతలు నిర్ణయించారు.

ఈరోజు లేదంటే రేపు అధికారికంగా ప్రకటన కూడా రావచ్చు అంటూ తన ట్విట్ లో పేర్కొన్నాడు.మరి కేఆర్కే ట్వీట్ పై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.కాగా ఇటీవల ఈ సినిమాలోని బేషరాం సాంగ్ వివాదంలో పడిన విషయం తెలిసిందే.ఆ సమయంలో దీపిక పదుకొనే వేసుకునే డ్రెస్ పై భారీగా ట్రోలింగ్స్ జరిపారు.అంతేకాకుండా బిజెపి, బాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్య పెద్ద యుద్ధమే నడిచింది అని చెప్పవచ్చు.
దీపికా పదుకునే సినిమాలోని పాటలు కాషాయ రంగు బికినీ డ్రెస్ ను ధరించడంతో పాటు అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది.దాంతో అసలు వివాదం మొదలైంది.







