2024 సంక్రాంతికి విపరీతమైన పోటీ ఉంది.సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన ‘గుంటూరు కారం’( Guntur Karam ) సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
ఇక విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం లో రూపొందిన సైంధవ్( Saindhav ) సినిమా ను కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.రవితేజ హీరో గా కార్తీక్ దర్శకత్వం లో రూపొందిన ఈగల్ సినిమా( Eagle Movie ) కూడా సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతుంది.
ఇక నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వం లో రూపొందుతున్న నా సామి రంగ( Naa Saami Ranga ) సినిమా కూడా సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇక ఇదే సమయంలో చిన్న హీరో, కొత్త హీరో అయిన తేజ సజ్జ తో( Teja Sajja ) దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన హను మాన్ సినిమా ను( HanuMan Movie ) కూడా సంక్రాంతి కి విడుదల చేయాలని భావిస్తున్నారు.గుంటూరు కారం విడుదల తేదీని ప్రకటించిన సమయంలోనే హనుమాన్ సినిమా విడుదల అవ్వబోతుంది.ఒక రోజు అటు లేదా ఇటు విడుదల తేదీని మార్చేందుకు నిర్మాత అంగీకరించక పోవడంతో నిర్మాతల మండలి లో చర్చలు కూడా జరపాల్సి వచ్చింది.
మధ్యే మార్గం గా సంక్రాంతికే( Sankranti ) విడుదల సరే కానీ గుంటూరు కారం సినిమాకు పోటీ కాకుండా కొత్త తేదీకి మారాలని నిర్మాతల మండలి హనుమాన్ నిర్మాతకు సూచించడం జరిగింది.అయినా కూడా హనుమాన్ నిర్మాత కు సినిమా పై ఉన్న నమ్మకం వల్ల నో చెప్పేశాడు.దాంతో గుంటూరు కారం కు కచ్చితంగా ప్రభావం ఉంటుంది అంటున్నారు.దిల్ రాజు రంగంలోకి దిగినా కూడా హనుమాన్ సినిమా వాయిదా ను వేయించలేక పోయారు.మరి హనుమాన్ సినిమా ఫలితం ఎలా ఉంటుంది, ఆ తర్వాత గుంటూరు కారం పరిస్థితి ఏంటి అనేది చూడాలి.