టాలీవుడ్ హీరోల కొత్త ప్లాన్.. స్పెషల్ పాత్రలకు ఒకే?

ఇటీవలి కాలంలో ఎన్నో సౌత్ సినిమాలు అటు నార్త్ లో కూడా సూపర్ హిట్ కావడంతో భాష పరిధిని చేరిపేసాయ్.దీంతో అక్కడి సినిమాలు ఇక్కడ.

 Tollywood Heros New Plan For Special Roles Tollywood, Nagarjuna, Nagachaitanya ,-TeluguStop.com

ఇక్కడ సినిమాలు అక్కడ విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సినిమా హీరోలు కూడా సిద్ధమైపోతున్నారు.కేవలం సినిమాలను విడుదల చేయడమే కాదు ఇక్కడ హీరోలు అక్కడ.

అక్కడి హీరోలు ఇక్కడ సినిమాల్లో నటించేందుకు కూడా రెడీ అవుతూ ఉండటం గమనార్హం.ఈ క్రమంలోనే మొన్నటి వరకు కేవలం టాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేసిన స్టార్ హీరోలు ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరోల కోసం నార్త్ లో ప్రత్యేక పాత్రలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే 2022 సెకండాఫ్ లో టాలీవుడ్ కు చెందిన ముగ్గురు స్టార్ హీరోలు ఇక బాలీవుడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారూ అని తెలుస్తోంది.ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు సంపాదించుకున్న అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన చిత్రం లాల్ సింగ్ చద్దా.అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు నాగచైతన్య.

ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక అక్కినేని నాగార్జున సైతం బాలీవుడ్లో ఒక స్పెషల్ పాత్రలో కనిపించేందుకు సిద్ధమయ్యాడు.

డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కిన బ్రహ్మాస్త్రం సినిమాలో నాగార్జున ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారు.ఇప్పటికే ఈ సినిమాలో నాగార్జున పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది.

ఈ సినిమా సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Telugu Alia Bhatt, Amir Khan, Bhramstra, Nagachaitanya, Nagarjuna, Ranbir Kappor

టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్ సైతం నార్త్ లో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించేందుకు సిద్ధమయ్యాడు.బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న కబీ ఈద్ కబీ దివాళి సినిమాలో కీలకపాత్రలో నటించబోతున్నాడు వెంకటేష్.సినిమాలు మరో పాత్రలో జగపతి బాబు కూడా కనిపించబోతున్నట్లు సమాచారం.

ఈ సినిమా డిసెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది.మరి ఈ స్పెషల్ రోల్స్ తో టాలీవుడ్ హీరోలు ఎంత మేరకు అలరిస్తారు అన్నది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube