టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సినీ ఫ్యామిలీగా ఎంతో మంచి గుర్తంపును సంపాదించుకున్న వారిలో దగ్గుబాటి ఫ్యామిలీ( Daggubati Family ) ఒకటి.దగ్గుబాటి రామాయుడు (Ramanaidu) నిర్మాతగా ఇండస్ట్రీకి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు.అయితే రామానాయుడు తర్వాత సురేష్ ప్రొడక్షన్ బాధ్యతలు అన్నింటిని కూడా సురేష్ బాబు(Suresh Babu) తీసుకున్నారు.
ఇలా సురేష్ బాబు నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా వెంకటేష్ (Venkatesh) హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ఎప్పుడు కూడా ఏ విషయంలోను గొడవ పడినటువంటి ఈ అన్నదమ్ములు ఎంతో అన్యోన్యంగా ఉంటారు.ఏ విషయమైనా పెద్దగా సురేష్ బాబు సలహా తీసుకోవడం పాటించడం జరుగుతుంటుంది.అయితే కేవలం ఒక హీరోయిన్ విషయంలో మాత్రం వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిందట.
మరి ఏ హీరోయిన్ కారణంగా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.వీరిద్దరి మధ్య జరిగిన ఆ గొడవ ఏంటి గొడవ జరగడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… కత్రినా కైఫ్ (Katrina Kaif) వెంకటేష్ సరసన మల్లీశ్వరి సినిమాలో( Malleswari Movie ) నటించిన సంగతి మనకు తెలిసిందే.
అప్పట్లో ఈమెకు ఏమి డిమాండ్ లేకపోయినప్పటికీ ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చే స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ మాత్రమే అని చెప్పాలి.

ఇలా ఏమాత్రం స్టార్ డమ్ లేనటువంటి హీరోయిన్ సురేష్ బాబు వెంకటేష్ హీరోగా నటిస్తున్న మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు.అయితే ఈమెకు పది లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశారట.ముందుగా పది లక్షల రూపాయలకు అగ్రిమెంట్ పూర్తి చేసుకుని అనంతరం ఈమెకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారు.
ఇలా ఏకంగా ఈమెకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వడంతో సురేష్ బాబు పట్ల వెంకటేష్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు.పది లక్షల రూపాయల డిమాండ్ చేయనటువంటి హీరోయిన్ కు ఇలా ఏకంగా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఇవ్వడంతో వెంకటేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారట.

ఇలా ఈమె రెమ్యూనరేషన్ ( Remuneration ) విషయంలో వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత సినిమాకు ఎంతో అద్భుతమైన టాక్ రావడమే కాకుండా హీరోయిన్ ను చూడటానికి ఎంతో మంది థియేటర్లకు వెళ్లేవారు.అలా కత్రినాకు ఈ సినిమా ద్వారా ఎంతో మంచి డిమాండ్ రావడమే కాకుండా, ఈ సినిమా కూడా కలెక్షన్ల పరంగా ఎంతో మంచి విజయవంతం కావడంతో ఆమెకు ఇచ్చిన రెమ్యూనరేషన్ పెద్దగా అనిపించలేదు.ఇక ఈ సినిమా తర్వాత రెమ్యూనరేషన్ విషయంలో ప్రతి ఒక్కరి రెమ్యూనరేషన్ పట్ల సురేష్ బాబు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించే వారిని తెలుస్తుంది.